బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ 'సంజు' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే 120 కోట్లు రాబట్టి బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాలో దాదాపు సంజయ్ జీవితంలో చాలా అంశాలను డైరెక్టర్ తెరపై చూపించాడు.

కొన్ని విషయాలను మాత్రం టచ్ చేయకుండా వదిలేశాడని తెలుస్తోంది. సినిమాలో ఓ సన్నివేశంలో సంజయ్ దత్ పాత్ర హీరోయిన్స్, వేశ్యలు అందరితో కలిపి 350 మందితో రొమాన్స్ చేశానని చెబుతాడు. ఈ విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సంజు' చిత్రదర్శకుడు సంజయ్ దత్ రొమాంటిక్ జీవితానికి సంబంధించి మరికొన్ని విషయాలను బయటపెట్టడం సంచలనంగా మారింది.

ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.. ''సంజయ్ దత్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలకు దగ్గరవ్వడం కోసం చిట్కాలు పాటించేవాడు. అందులో భాగంగా వాళ్లను స్మశానానికి తీసుకెళ్లి తన తల్లి సమాధిని చూపించి సానుభూతి పొందేవాడు. మా అమ్మ ఈ లోకంలో లేదు తనను పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యి అక్కడే వాళ్లతో రొమాన్స్ చేసేవాడు. అలానే తనను ఎవరైన అమ్మాయి మోసం చేస్తే.. అంతే దారుణంగా ప్రవర్తించేవాడు'' అంటూ సంజయ్ దత్ లో ఉన్న మరో కోణాన్ని కూడా బయటపెట్టాడు. తనకంటే సీనియర్ హీరోయిన్లతో కూడా సంజయ్ ఎఫైర్ పెట్టుకునేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.