టాలీవుడ్ లో 'గీతాంజలి', త్రిపుర', 'లక్కున్నోడు' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజ్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు.

ఆయనకి సడెన్ గా గుండెపోటు రావడంతో కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన 'విశ్వామిత్ర' సినిమాను తెరకెక్కిస్తున్నారు.

నందితరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.