ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. చాలా కాలం తరువాత పూరి ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఆర్థికంగా కూడా ఈ సినిమా లాభాలు తీసుకొచ్చింది. 

వచ్చిన లాభాలతో పూరి, ఛార్మి లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. పూరి రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీని కొనగా.. సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి బీఎండబ్ల్యూ 7 సిరీస్ సెడాన్ కారుని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పూరి తన సొంత బ్యానర్ ని స్థాపించుకొని అందులోనే సినిమాలు తీస్తున్నాడు. నటి ఛార్మి కూడా యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి పూరితో పార్టనర్షిప్ పెంచుకొని పూరి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. వచ్చిన లాభాల్లో ఇద్దరూ వాటా తీసుకుంటూ బిజినెస్ చేస్తున్నారు.

ప్రస్తుతం పూరి, ఛార్మి కలిసి విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ అనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా  షూటింగ్ మొదలుకానుంది.