ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సోనూ సూద్ పేరు మారుమోగిపోతోంది. కష్టాల్లో ఉన్న వారికి సోనూ సూద్ ఓ సూపర్‌ హీరోల కనిపిస్తున్నాడు. తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్య మీద వెంటనే స్పందిస్తూ కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ హైప్‌ ఏ స్థాయిలో ఉందంటే సమస్యల్లో ఉన్న వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించే కంటే సోనూ సాయం కోరితే ఫలితం త్వరగా ఉంటుందన్న రేంజ్‌ చేరింది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్‌ ట్వీట్‌పై టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ స్పందించాడు. ఓ నెటిజెన్‌ సోనూ సూద్‌ పూరి కాంబినేషన్‌లో వచ్చిన ఏక్‌ నిరంజన్‌ సినిమాలోని సీన్‌ను ట్వీట్ చేస్తూ సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది అంటూ కామెంట్ చేశాడు. అయితే ట్వీట్‌పై పూరి జగన్నాథ్ స్పందిస్తూ నాకు తెలుసు సోనూ ఎప్పుడూ హీరోనే అంటు కామెంట్ చేశాడు.

కరోనా కష్టకాలంలో లాక్‌ డౌన్‌ కారణంగా ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడిన వేలాది మంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో ఇళ్లకు చేర్చాడు సోనూ. అంతేకాదు ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలన కొనసాగిస్తున్నాడు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఓ కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వటం, ఆ తరువాత తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత తీసుకునేందుకు ముందుకు రావటంతో సోనూ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది.