పునీత్ ని హీరోగా లాంఛ్ చేసే బాధ్యత దర్శకుడు పూరి జగన్నాధ్ చేతిలో పెట్టారు తండ్రి రాజ్ కుమార్. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ...Puneeth rajkumar కుమార్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పూరి.
చైల్డ్ ఆర్టిస్ట్ 14 సినిమాలు చేశారు పునీత్ రాజ్ కుమార్. 1985లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన బెట్టాడ హోవు చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 1989లో విడుదలైన పరశురామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ రాజ్ కుమార్ కి చివరి చిత్రం. ఈ చిత్రంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్ హీరోగా నటించారు. పరుశురామ్ చిత్రంలో పునీత్ క్యారెక్టర్ నేమ్ అప్పు.
పునీత్ ని హీరోగా లాంఛ్ చేసే బాధ్యత దర్శకుడు పూరి జగన్నాధ్ చేతిలో పెట్టారు తండ్రి రాజ్ కుమార్. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ...Puneeth rajkumar కుమార్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పూరి. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ చిత్రానికి అప్పు అధికారిక రీమేక్. ఇడియట్ లో హీరోయిన్ గా నటించిన రక్షిత కన్నడలో కూడా నటించారు.
ఓ భిన్నమైన లవ్ స్టోరీగా దర్శకుడు Puri jagannadh అప్పు చిత్రాన్ని తెరకెక్కించారు. పునీత్ రాజ్ కుమార్ పూరి మార్క్ హీరోగా వెండితెరపై అద్భుతం చేశారు. హీరోగా డెబ్యూ మూవీకి సరైన సరుకు దొరికింది. పునీత్ రాజ్ కుమార్ స్టార్ గా ఎదగడానికి అప్పు పునాది వేసింది. వసూళ్ల వర్షం కురిపించిన Appu,థియేటర్స్ లో 200 రోజులు రన్ పూర్తి చేసుకొని, అనేక కొత్త రికార్డ్స్ నెలకొల్పింది.
Also read Puneeth rajkumar death: చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న పునీత్ రాజ్ కుమార్
పునీత్ కుమార్ ని ఆయన ఫ్యాన్స్ ముద్దుగా అప్పు అని పిలుచుకోవడం విశేషం. అలా పునీత్ రాజ్ కుమార్ కెరీర్ లో పూరి ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన Romantic చిత్రం,పునీత్ అన్నగారైన శివరాజ్ కుమార్ నటించిన భజరంగి 2 చిత్రాలు విడుదల రోజునే ఆయన మరణించడం విధి విచిత్రం. బజరంగీ 2 ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న పునీత్ రాజ్ కుమార్ చాలా యాక్టీవ్ గా కనిపించారు. రెండు రోజుల క్రితం అంత ఆరోగ్యంగా కనిపించిన పునీత్, నేడు లేడన్న వార్తను ఎవరూ జీర్ణించుకోలేకున్నారు.
Also read Puneeth Rajkumar Death: కర్నాటకలో భారీ బందోబస్త్, థియేటర్లు మూసివేత.. శోకసంద్రంలో అభిమానులు..
ఫిట్నెస్ అంటే శ్రద్ధ కలిగిన పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన బెంగుళూరులో విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
