‘కేజీఎఫ్: చాప్టర్-1’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ‘కేజీఎఫ్-2’ను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ప్రశాంత్ నీల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
సినీ రంగంలో చాలామందికి మద్యం అలవాటు వుంటుందని చెప్తారు. అయితే ఎవరూ కూడా నేను తాగుతాను అని పనిగట్టుకుని చెప్పరు. ఫలానా వాళ్లు తాగుతారు అని మీడియా అనలేదు. కానీ ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్లందిరికీ భిన్నం. తన తాజా చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మద్యం సేవించడం గురించి..ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ....కథ రాసేటప్పుడు మద్యం ఫుల్లుగా సేవిస్తానని, ఆ మత్తులోనే కథ రాస్తాననీ, సన్నివేశాలూ అప్పుడే రాసుకుంటానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. అలాగే మద్యం మత్తులో కథ, సన్నివేశాలు రాసుకున్నాక.. ఆ కిక్కు దిగిపోయాక కూడా అంతే ‘హై’ ఆ కథలో, సీన్లు కనిపిస్తేనే, దాన్ని సినిమాగా తీస్తానని ప్రశాంత్ నీల్ చెప్పి షాక్ ఇచ్చారు.
‘కేజీఎఫ్: చాప్టర్-1’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ‘కేజీఎఫ్-2’ను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ప్రశాంత్ నీల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తర్వాత, ప్రభాస్‌తో ఓ సినిమా అలాగే ఎన్టీయార్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్-31’ వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళుతుందని ప్రశాంత్ నీల్ చెప్పాడు. ‘సలార్’ పూర్తయిన అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలిపాడు. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని వివరించాడు. ‘ఎన్టీఆర్-31’ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాల సమయం ఉంది కాబట్టి ఏ జోనరో ప్రస్తుతం అడగొద్దన్నాడు.
తాను గత 15-20 ఏళ్లుగా యంగ్ టైగర్‌కు అభిమానినని పేర్కొన్నాడు. తాను సినిమా చేయబోయే హీరోలతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటానని కూడా ప్రశాంత్ చెప్పాడు. అందుకే స్క్రిఫ్ట్ వర్క్ ప్రారంభించడానికి ముందు దాదాపుగా 10 నుంచి 15సార్లు తారక్‌ను కలిశాడట. ఎన్టీఆర్‌తో ప్రయాణం అద్భుతంగా ఉందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ఈ ప్రయాణంలో తాము సన్నిహిత మిత్రులుగా మారామన్నాడు. తాను చెప్పిన కథకు తారక్ ఫిదా అయ్యాడట. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతోందన్నాడు.
ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ తాము ఓ ప్రాజెక్ట్‌కు కలసి పనిచేయబోతున్నామని 2021, మే నెలలోనే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది మేలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రశాంత్ నీల్ మరో చిత్రం... ‘సలార్’ షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది. 2023 వేసవి కానుకగా ఈ మూవీ విడుదల అవుతుంది. అనంతరం ‘ఎన్టీఆర్-31’ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
