కేజీఎఫ్ తో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘సలార్ 2’పై తాజాగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’Salaar. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్, ఇండియన్ ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కు కూడా తన రేంజ్ కి తగ్గ సక్సెస్ బాహుబలి తర్వాత దక్కడం లేదు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో ఉసూరుమనిపించింది. రొమాంటిక్ గా హిట్ కొడతాడని భావించిన రాధే శ్యామ్ కూడా నిరాశపరిచింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డం స్థాయికి తగ్గ విజయం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్స్ సలార్, ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’ (Adipurush) షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం.. ‘సలార్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను చూపిస్తారనే గట్టి నమ్మకం ఉంది. దీంతో కన్నడ, తెలుగులో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘సలార్ 2’ కూడా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ నీల్ తాజాగా స్పందించారు. 

కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Kgf 2) ప్రమోషన్స్ లో బీజీగా ఉన్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ 2 (Salaar 2) పై క్లారిటీ ఇచ్చారు. విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సలార్ చిత్రాన్ని ముందుగా ఆడియెన్స్ ఆదరించాలి. ప్రేక్షకులు ఇచ్చే ట్రూ జడ్జ్ మెంట్ బట్టి తన నిర్ణయం ఉంటుందంటూ చెప్పారు. ఇప్పటికైతే సలార్ 2పై ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. ఒకవేళ అనౌన్స్ చేస్తే మాత్రం గట్టిగానే అనౌన్స్ చేస్తామని చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో సలార్ 2 వచ్చే అవకాశం ఉందంటూ భావిస్తున్నారు. 

YouTube video player

సలార్ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ కమాండర్ గా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఇక కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రెండు రోజుల్లో విడుదలవుతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులను మరింతగా రీచ్ అయ్యేందుకు ప్రచార కార్యక్రమాలను కూడా గట్టిగానే చేస్తున్నారు.