Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో రిలీజ్ కాబోతున్న ‘హనుమాన్’.. పాన్ వరల్డ్ ఫిల్మ్ గా విడుదలకు ఏర్పాట్లు!

క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కుతున్న విజువల్ వండర్  ‘హనుమాన్’ చిత్రం పాన్ వరల్డ్ గా విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమై విషయాలను వెల్లడించారు. 
 

Director Prasanth Varmas HANUMAN movie To Have Pan World Release!
Author
First Published Jan 9, 2023, 2:07 PM IST

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) - అమృత అయ్యర్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘హనుమాన్’ (Hanu-Man). శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలై హ్యూజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మెస్మరైజింగ్ విజువల్స్, సూపర్ బీజీఎం, గ్రాఫిక్ వర్క్ అద్బుతంగా ఉంది. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ రూపుదిద్దడంతో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను మేకర్స్ తాజాగా వెల్లడించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఆయా దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే సినిమా బడ్జెట్ కాస్తా తక్కువే అయినా..  అవుట్‌పుట్ హాలీవుడ్ చిత్రానికి తక్కువేం కాదని భావిస్తున్నారు. ఈ ఏడాది సమర్మ్ (మే 12న)లో విడుదల కానున్నఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మరో 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు  ప్రకటించారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ గా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. 

ఇదే విషయాన్ని తాజాగా అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా కన్ఫమ్ చేశారు. తెలుగు సినిమా ఇన్నీ భాషల్లో రిలీజ్ కావడం ఇదే తొలిసారి కాబోతుండటం విశేషం. కథపై ఉన్న నమ్మంతో సినిమా రిలీజ్ కు పాన్ వరల్డ్ గా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక తాజాగా విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటుంది. వరల్డ్ మ్యాప్‌ లో హనుమాన్ ముఖ చిత్రం, గధను చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సినిమా విడుదల కానుందని  ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో చూపించడం ఆకర్షణీయంగా మారింది. 

తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో గతంలో ‘జాంబిరెడ్డి’ వచ్చి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హనుమాన్’ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. చిత్రంలో తేజ సజ్జ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా శివేంద్ర మంచి అవుట్ పుట్ అందించారు. గౌరహరి, అనుదీప్ దేవ్ మరియు కృష్ణ సౌరభ్ అద్భుతమైన సంగీతం అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios