సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నారు. 

మే 12న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. డైరెక్టర్ పరశురామ్, హీరోయిన్ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. సర్కారు వారి పాట షూటింగ్ దశలో ఉన్నప్పుడు.. మహేష్.. పరశురామ్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పరశురామ్ ని ప్రశ్నించగా ఆసక్తికరంగా బదులిచ్చాడు. 

మహేష్ గారితో గొడవ జరగలేదు అని నేను చెబితే అబద్దమే అవుతుంది. అవును మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ అది చాలా చిన్నది. ఒక ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్నపాటి మనస్పర్థలు వస్తుంటాయి. అలాంటిది ఒక పెద్ద సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు కూడా ఇలాంటివి సహజమే. 

కరోనా వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో మహేష్ గారికి కాస్త ఒత్తిడి ఎక్కువైంది. అందువల్లే ఆయన నాపై చిన్నపాటి కోపం ప్రదర్శించారు. అంతకు మించి ఏమీ లేదు అని పరశురామ్ అన్నారు. 

మా నాన్నకు కోవిడ్ వస్తే పది సార్లు ఫోన్ చేసి ఆరా తీశారు. అలాగే నా భార్యకు చికిత్స అవసరం అయినప్పుడు స్వయంగా మహేష్ గారే డాక్టర్ ని పంపారు. మా ఇద్దరి మధ్య అంత మంచి రిలేషన్ ఉంది అని పరశురామ్ తెలిపారు.