సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ కాంబినేషన్ మూవీ సర్కారువారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.  

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ కాంబినేషన్ మూవీ సర్కారువారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 

సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ నిండిపోయింది. సర్కారువారి పాట ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేస్తున్నారు. ఈ సినిమా కథను మహేష్ కు ఎలా చెప్పాడో డైరెక్టర్ పరశురామ్ అభిమానులతో పంచుకున్నారు. 

గీత గోవిందం సినిమా తరువాత మహేష్ బాబు కోసం సర్కారు వారి పాట సినిమా కథ రాసుకున్నాను. కాని మహేష్ ను ఎలా రీచ్ అవ్వాలో తెలియాదు. ఈ విషయంలో.. డైరెక్టర్ కొరటాల శివ సాయం చేసినట్టు పరశురామ్ చెప్పారు. ఇక మహేష్ కు కథ చెప్పాలంటే బయం వేసిందని. కథ, క్యారెక్టర్లు నేరేట్ చేసేప్పుడు 5 నిమిషాలకు మహేష్ లో చిన్న స్మైల్ చూశానన్నారు పరశురామ్. 

ఇక ఈ కథ ఒకే అయిన తరువా మహేష్ తనకు చేసిన మెసేజ్ ను మర్చిపోలేనన్నారు పరశురామ్. పరశురామ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటూ మహేష్ మెసేజ్ చేశాడట మహేష్. అప్పటి నుంచి మీకు డబుల్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తపనతో పనిచేశానన్నారు పరశురామ్. తన జన్మంతా మహేష్ బాబుకు రుణపడి ఉంటాన్నారు డైరెక్టర్ ఇక తనతో కలిసి పనిచేసిన టెక్నీషయన్స్ కు స్పెషల్ గా తమన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పాడు. 

ఇక మే 12న రిలీజ్ కాబోతున్న ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్. 

ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఇక నుంచి సూపర్ స్టార్ కూడా వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.