`ఆదిపురుష్‌` సినిమా తమ సినిమా కాదు, ప్రభాస్‌ సినిమా కాదు, ఇది మీ అందరి సినిమా అని, భారతీయులు సినిమా అని, ఇండియన్‌ సినిమా అని అన్నారు దర్శకుడు ఓం రౌత్‌.

`ఆదిపురుష్‌` సినిమా తమ సినిమా కాదు, ప్రభాస్‌ సినిమా కాదు, ఇది మీ అందరి సినిమా అని, భారతీయులు సినిమా అని, ఇండియన్‌ సినిమా అని అన్నారు దర్శకుడు ఓం రౌత్‌. ఆయన రూపొందించిన మైథలాజికల్‌ మూవీ `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా నటించారు. కృతి సనన్‌ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటించగా, ఈ సినిమా జూన్‌ 16న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుపతిలో `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ, ఎమోషనల్‌ అయ్యారు. నిర్మాత భూషణ్‌ కుమార్‌తో తమకున్న అనుబంధం గురించి చెప్పారు. ఆయనతో బాండింగ్‌ మరువలేనిది అని, ఆయన మాటలు తనని ఎమోషనల్‌కి గురి చేశాయన్నారు. అనంతరం ప్రభాస్‌ లేకపోతే ఈ సినిమా లేదని, ప్రభాస్‌ వల్లే ఈ సినిమా సాధ్యమైందని తెలిపారు. 

`ఆదిపురుష్‌` నా సినిమా కాదు, భూషణ్‌ కుమార్‌ సినిమా కాదు, కృతి సినిమా కాదు, ప్రభాస్‌ సినిమా కాదని, ఇది మీ అందరి సినిమా అని అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడి సినిమా అని, భారతీయ సినిమా అది, ఇకపై మీరే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఆయన భావోద్వేగా వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్‌ అంటూ హోరెత్తించారు. అందరిలోనూ ఉత్తేజాన్ని నింపారు.