దృశ్యం, మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలతో పాపులర్ అయిన దర్శకుడు నిషికాంత్ కామత్. ఆయన ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉంది. ఈ మేర‌కు ఆయ‌న అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్‌లో చేరి వైద్యం తీసుకుంటున్నారు. గ‌త కొంత‌కాలంగా కాలేయ స‌మ‌స్య‌తో పోరాడుతున్న నిషికాంత్ ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని స‌మాచారం. గ‌తంలోనూ ఇదే స‌మ‌స్య ఎదుర‌వ్వ‌గా, చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఇప్పుడు అది తిర‌గ‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది.

నిషికాంత్ కామత్ 2015 లో విడుదలైన అజయ్ దేవ్‌గన్ నటించిన దృశ్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది. 2016 లో విడుదలైన జాన్ అబ్రహం నటించిన రాకీ హ్యాండ్సమ్ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించారు. 

అలాగే అజ‌య్ దేవ‌గ‌న్, శ్రియ న‌టించిన ”దృశ్యం, ఇర్ఫాన్ ఖాన్ మ‌దారి, జాన్ అబ్ర‌హం ఫోర్స్, రాకీ హ్యాండ్స‌మ్” లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు నిషికాంత్ కామ‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిషికాంత్ ”డొంబివాలి ఫాస్ట్‌, లై భారీ” సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాయి. మ‌రాఠీలోనూ ఈయ‌న చాలా చిత్రాలను తెర‌కెక్కించారు.