శనివారం సాయంత్రం టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును.. మనుషుల్లో ఉన్నట్టుగానే, అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే మా సినిమాలోనూ లోపాలున్నాయని తెలిపారు.
లేడీ దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన `అన్ని మంచి శకునములే` చిత్రం గురువారం విడుదలై నెగటివ్ టాక్‌ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. చాలా వరకు ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును.. మనుషుల్లో ఉన్నట్టుగానే, అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే మా సినిమాలోనూ లోపాలున్నాయని తెలిపారు. అన్నీ ఎలిమెంట్లు టాప్‌లో ఉన్నాయి, లోపం ఏదైనా ఉందంటే అది రైటింగ్లోనే. దానికి తనదే బాధ్యత అని తెలిపింది.
సినిమా రివ్యూలపై కామెంట్ చేస్తూ చాలా వరకు నెగటివ్‌గా ఉన్నాయనేది ఆమె తెలిపింది. అయితే అది మహా అయితే రెండు వందల మంది అభిప్రాయం మాత్రమే అని తెలిపింది. చాలా మంది ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమా నచ్చిందని తెలిపింది. రివ్యూల్లో కూడా మొదట సినిమా స్లోగా ఉందని చెప్పినా, క్లైమాక్స్ బాగుందని, ఎమోషనల్‌గా ఉందని చెబుతున్నారు. వాళ్లు ఇది చెప్పగలుగుతున్నారు అంటే రెండు గంటలు ఆయా పాత్రలను వారు ఫాలో అయ్యారు. అందుకే చివర్లో ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యిందని తెలిపింది నందినిరెడ్డి.
ఆమె ఇంకా చెబుతూ, ఇలాంటి కంటెంట్‌ని చెప్పగలిగే స్వేచ్ఛ లేకపోతే ఏ సక్సెస్ కి అయినా అర్థం లేదని, ఈ విషయంలో డేర్ చేసి, స్వేచ్ఛగా సినిమా తీసిన నిర్మాతలకు ప్రియాంక స్వచ్ఛగా తీశారు. వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సినిమాలో రైటింగ్ సైడ్ కొన్ని లోపాలున్నా, అవి కొంత ప్రయోగాత్మకంగా చేశాయి. ఆ విషయంలో తన డైరెక్షన్ చాలా మెచ్యూర్ గా ఉందని చాలా మంది చెప్పారు, తాను కూడా అదే నమ్ముతున్నా. సినిమాలోని ఏదో ఒక అంశం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, చాలా మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారని తెలిపింది నందినిరెడ్డి.
నందినిరెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించగా, రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి ముఖ్య పాత్రలు పోషించారు. స్వప్న మూవీస్, మిత్రవిందా మూవీస్‌లతో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఇక శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో చిత్ర హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, 20 ఏళ్ళ క్రితం నాన్న తీసిన `వర్షం` సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. మళ్లీ ఆ సంతోషం మా అమ్మలో ఈ సినిమా తీసుకువచ్చింది. దానికి కారణం స్వప్న, ప్రియాక, నందినిరెడ్డి గార్లే. ప్రేక్షకులే నిజాయితీగా మాట్లాడతారు. అంతే నిజాయితీగా సినిమా తీశాం. నటుడిగా ఈ సినిమాకు పేరు వచ్చిందంటే దానికి కారణం దర్శక నిర్మాతలే` అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాళవిక నాయర్, ప్రియాంక దత్, స్వప్న దత్, ఇతర చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
