స్టార్ హీరోలు మల్టీస్టారర్స్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు. సౌత్ ఇండియాలో ఈ కల్చర్ కొంచెం తక్కువే. బాలీవుడ్ లో మాత్రం ఇమేజ్ తో సంబంధం లేకుండా కథ నచ్చితే, స్టార్స్ సైతం మల్టీస్టారర్స్ చేస్తారు. తెలుగులో మహేష్, పవన్ మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆశపడుతున్నారు. రాజమౌళి చొరవతో నందమూరి-మెగా ఫ్యామిలీ వారసులు ఎన్టీఆర్, చరణ్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని స్టార్స్ మల్లీస్టారర్స్ ఫ్యాన్స్ కలగానే ఉన్నాయి. 

ఐతే సౌత్ లో అతిపెద్ద చిత్ర పరిశ్రమలుగా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తే సౌత్ ఇండియా మొత్తం షేక్ అవడం ఖాయం. అలాంటి కాంబినేషనే దర్శకుడు మురుగదాస్ సెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని స్పైడర్ మూవీ ప్రమోషనల్ కార్యక్రమం సమయంలో మురుగుదాస్, మహేష్ సమక్షంలో చెప్పారు. 

మహేష్-విజయ్ కలయికలో మురుగదాస్ ఓ కథ సిద్ధం చేశారట. తెలుగు వర్షన్ లో మహేష్ కి విలన్ గా విజయ్, తమిళ వర్షన్ లో విజయ్ కి విలన్ గా మహేష్ తో సినిమాలు చేయాలని అనుకున్నాడట. ఆ కథను విజయ్ కి చెప్పగా అతను ఒకే కూడా చేశారట. కాకపోతే ఒక కండీషన్ పెట్టాడట. టాలీవుడ్ లో మహేష్ కి మాత్రమే విలన్ గా చేస్తాను, మరే ఇతర హీరోకి నేను చేయను అన్నాడట. 

ఇద్దరు స్టార్స్ కూడా ఈ ఒప్పందానికి ఒప్పుకున్నప్పటికీ ఎందుకో ఈ మూవీ కార్యరూపం దాల్చలేదు. స్పైడర్ మూవీ అనుకున్నంత విజయం, సాధించక పోవడం కూడా ఒక కారణం కావచ్చు. నిజంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే అటు మహేష్, ఇటు విజయ్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.