వరుస ఫ్లాప్ చిత్రాలతో వెనుకబడ్డ రాజ్ తరుణ్ మళ్లీ ట్రాక్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇంతలో అతడికి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

దర్శకుడు మారుతి.. రాజ్ తరుణ్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడట. తన బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేయడం లేదు.

మారుతి టాకీస్ లో పనిచేసిన ఓ దర్శకుడు ఈ సినిమాని హ్యాండిల్ చేయబోతున్నాడు. సరదాగా సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. కథలో ఉండే ట్విస్ట్ లు ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తాయని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. మారుతి ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు.