Asianet News TeluguAsianet News Telugu

రివ్యూలపై కౌంటర్ వేసిన మారుతి

రివ్యూలపై కౌంటర్ వేసిన మారుతి

director maruthi counter to reviewers

నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయ్యి డివైడ్ తెచ్చుకుంది. సినిమా కలెక్షన్లు కూడా చెప్పుకునే స్థాయిలో లేవు. కానీ ప్రమోషన్స్ మాత్రం బాగా గట్టిగానే చేస్తున్నారు. రీసెంట్ గా డైరెక్టర్ల తో ఒక ఇంటర్వ్య జరిగింది. ఇందులో హరీష్ శంకర్, వక్కంతం, మారుతి బన్నిసినిమా గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా రివ్యూల గురించి మారుతి గట్టి కౌంటర్ వేశాడు. మారుతి మాట్లాడుతూ.. తాను ‘నా పేరు సూర్య’ సినిమాను రెండుసార్లు చూశానన్నాడు.

ఒకసారి మామూలుగా తొలి రోజు ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో 8.45 షో చూశానన్నాడు. ఇంకోసారి సినీ మ్యాక్స్ లో రెండు రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి షో చూశానన్నాడు. ఐతే ఐమాక్స్ లో తొలి రోజు చూసిన షోతో జెన్యూన్ టాక్ తెలియలేదన్నాడు. ఇందుకు కారణం రివ్యూయర్లే అని చెప్పాడు. రివ్యూయర్లను జడ్జిలుగా పేర్కొన్న మారుతి.. ఆ షోకు ఎక్కువమంది వాళ్లే ప్యాడ్లు పట్టుకుని వస్తారన్నాడు. ప్రతి సీన్ గురించి చకచకా రాసేస్తుంటారని.. ఇది బాగుంది.. ఇది బాగా లేదు అంటూ అక్కడే రివ్యూ చేసేస్తారని మారుతి చెప్పాడు. దాని వల్ల ఒరిజినల్ టాక్ తెలియదన్నాడు. కానీ రెండు రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే ఒరిజినల్ టాక్ తెలిసిందని.. పిల్లలు ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డారని అన్నాడు మారుతి.

ఈ మటల వల్ల మీడియా ప్రతినిధులు మారుతి పై గుర్రుమంటున్నారు. రివ్యూయర్లు తమ బాధ్యత మేరకు తమ పనేదో తాము చేసుకుంటున్నపుడు మారుతికి దాంతో సంబంధం ఏముంది? తన పాటికి తాను సినిమా చూసి తన జడ్జిమెంటేదో తాను ఇవ్వొచ్చుగా. సినిమా థియేటర్లలో 600 మంది రివ్యూ రైటర్లే ఉండరు కదా, మహా అయితే పదిమంది ఉంటారేమో అంటు మారుతి పై సెటైర్లు వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios