బాలీవుడ్ పై కాస్త ఘాటు వ్యాక్యలు చేశారు సౌత్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ఇకనైనా కళ్లు తెరవండంటూ.. చిన్న పాటి క్లాస్ పీకారు సీనియర్ దర్శకుడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ?
సౌత్ నుంచి మంచి మంచి సినిమాలు అందించిన స్టార్ సీనియర్ డైరెక్టర్లలో.. మణిరత్నం ఒకరు. అద్భుతమైన సినిమాలు అందించిన ఆయన ఆతరువాత సినిమాలు తగ్గించారు. ఇక రీసెంట్ గా టాలీవుడ్ ను చూసి.. ధైర్యం తెచ్చుకుని.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ కు ప్రాణం పోశారు మణిరత్నం. ఇక ఈ స్టార్ డైరెక్టర్ రీసెంట్ గా బాలీవుడ్ కు చిన్న క్లాస్ ఇచ్చారు. చిన్న చిన్న సూచనలు కూడా చేశారు.
బుధవారం చెన్నైలో సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ తనను బాలీవుడ్ అని పిలుచుకోవడం మానుకోవాలని కోరారు. అప్పుడు జనాలు కూడా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదనే విషయాన్ని అర్ధం చేసుకుంటారని అన్నారు. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదని.. ఇండియన్ సినిమాలో సౌత్ సినిమా.. రికార్డ్ లు కొల్లగొడుతుందన్నారు.
అంతే కాదు ఈ సమావేశంలో మణిరత్నం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తావించారు. హిందీ సినిమా తతను తాను బాలీవుడ్ అని పిలుచుకోవడాన్ని ఆపివేయాలి. అప్పుడు ప్రజలు సైతం భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని గుర్తించడాన్ని ఆపివేస్తారు. నేను బాలీవుడ్, కోలీవుడ్ తరహా వుడ్స్ కు వ్యతిరేకిని.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటిని ఇండియన్ సినిమాగానే చూడాలి. మనం ఈ పరిశ్రమ మొత్తాన్ని భారతీయ సినిమాగానే చూడాలి అని అన్నారు. దాంతో మణిరత్నం వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమా-2 రూపొందించడంలో మణిరత్నం బిజీగా ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ సహా మణిరత్నం తెరకెక్కించిన రోజా లాంటి సినిమాలు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాయి. ఒక్కప్పుడు ఇండియన్సినిమా అంటే.. ఓన్లీ బాలీవుడ్ సినిమా అనేవారు. కాని ఇప్పుడు సౌత్ సినిమాలు.. ముఖ్యంగా తెలుగుసినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు ధారుణంగా పరాజయం పాలు అవుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు సినిమావైపు ప్రంపంచం చూపు పడింది. అంతే కాదు టాలీవుడ్ నటులను కావాలని ఏరి కోరి తమ సినిమా్లో నటింపచేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. తెలుగులో తమ సినిమాకు మంచి మార్కెట్ రావడం కోసం.. తెలుగు స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ఈసందర్భంలో మణిరత్నం చేసిన వ్యాక్యలు మరింత ఆలోచించపచేస్తున్నాయి.
