Asianet News TeluguAsianet News Telugu

తెలుగు నిర్మాతలకు డైరక్టర్ లింగుస్వామి ఓ రేంజిలో వార్నింగ్

ఈ నేపధ్యంలో తమిళ దర్శకుడు రీసెంట్ గా రామ్ తో ది వారియర్ తీసిన దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రకటన డిస్కషన్ గా మారింది.

 Director Lingusamy warning to Telugu Film Chamber
Author
First Published Nov 20, 2022, 11:18 AM IST

డబ్బింగ్  చిత్రాల వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్‌’ రాజు, శిరీష్, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. కాని సంక్రాంతి సీజన్ లోనే నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్‌ సుంకర నిర్మించిన ‘ఏజెంట్‌’ సంక్రాంతి రిలీజ్‌కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్‌ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్‌కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపధ్యంలో తమిళ దర్శకుడు రీసెంట్ గా రామ్ తో ది వారియర్ తీసిన దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రకటన డిస్కషన్ గా మారింది.

లింగుస్వామి మాట్లాడుతూ.. వారిసు చిత్రానికి తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలలో థియేటర్స్ దొరకకపోతే తెలుగు సినిమా అనేక రకాలుగా చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే యావరేజ్ ని తమిళ సినిమాల రెవిన్యూ ఇరవై శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుంది. ఈ నేపధ్యంలో ఇలా లింగుస్వామి వార్నింగ్ ఇవ్వటం అంతటా చర్చనీయాంశంగా మారింది. తమిళ దర్శకులను మనవాళ్లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతూంటే వాళ్లు తిరిగి తెలుగు వాళ్లకే వార్నింగ్ ఇచ్చే స్దితికి వచ్చారని అంటున్నారు.
 
 మరో ప్రక్క సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్‌ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్‌ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారు‌. ఒకవేళ తెలుగులో డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా తమిళంలో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్‌ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే  పని కాదని ‘తోడేలు’ ఈవెంట్‌లో అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్‌ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios