ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా రిలీజయ్యి పరవాలేదనిపించే విధంగా డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా దర్శకుడు క్రిష్ ఫస్ట్ పార్ట్ బాగానే తెరకెక్కించాడు గాని సినిమాకు సంబందించిన రచయితను పెద్దగా పట్టించుకోలేదనే టాక్ వైరల్ అవుతోంది. 

టైటిల్స్ కార్డ్ విషయంలో దర్శకుల సంఘం వరకు వెళ్లగా చివరకు రచన సహకారం అని మొత్తానికి క్రెడిట్ ఇచ్చారు. ఆ సంగతి పక్కనపెడితే రైటర్ శ్రీనాథ్ రాసిన కొన్ని మెయిన్ సీన్స్ మిస్ అయ్యాయి. అలాగే పలు సన్నివేశాలను రైటర్ చెప్పినట్టుగా కాకుండా క్రిష్ తన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు. అక్కడక్కడా సీన్స్ అనుకున్నంతగా రాలేవు అనే టాక్ వస్తోంది. 

మిస్సయిన మెయిన్ సీన్స్ ఏవంటే.. రామారావు బొమ్మలు గీయడంలో మంచి సిద్దహస్తుడని అందరికి తెలిసిందే. అయితే యుక్త వయసులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మ గీసి తన వద్ద దాచుకున్న ఎన్టీఆర్ కి సడన్ గా ఒకరోజు రైల్వే స్టేషన్ లో చంద్రబోస్ కనిపించగా ఆయనకు ఇచ్చారట. చంద్రబోస్ ఎన్టీఆర్ ను మెచ్చుకొని బాగా గీసావ్ అని ప్రశంసలు కూడా అందించారు. ఇలాంటి మంచి సీన్ పడి ఉంటే సినిమాలో హైలెట్ గా నిలిచేది. 

అలాగే రామానాయుడు అడ్వాన్స్ ఇచ్చే సన్నివేశంతో పాటు ప్రధానంగా ఎన్టీఆర్ లవ్ స్టోరీని క్రిష్ వదిలేయడం గమనార్హం. ఎన్టీఆర్ జీవితాన్ని మూడు గంటల్లో చూపించడం కష్టమే గాని టైమింగ్ ఎక్కువగా ఉన్నా సీన్స్ కట్ చేసి రామారావు - బసవతారకం ప్రేమను చూపించి ఉంటే బావుండేది. బసవతారకం పుట్టగానే ఎన్టీఆర్ కు ఇచ్చి చేయాలనీ అనుకున్నారు వారి మామయ్య. 

కానీ కుటుంబ సభ్యులు ఆర్థిక కారణాల వల్ల ఒప్పుకోలేదని ఒక టాక్ అయితే ఉంది. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి బసవతారకంను వివాహం చేసుకున్న సన్నివేశాలు రాసుకున్నప్పటికీ క్రిష్ వాటిని సైడ్ చేసేశాడు. మరి మహానాయకుడులో ఫ్లాష్ బ్యాక్ అని వాటిని ఏమైనా టచ్ చేస్తారా లేక పూర్తిగా పొలిటికల్ డ్రామానే నడిపిస్తారా అనేది తెలియాంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా దర్శకుడు క్రిష్ రచయిత ఆలోచన విధానాన్ని చాలా వరకు మిస్ అవ్వడమే సినిమాలో లోపలకు కారణమని టాక్ వస్తోంది.