కామెడీ హీరో సంపూర్నేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజైన తరువాత సినిమాకి లాభాలొచ్చాయి.

ఈ సినిమాతో పాటు విడుదలైన 'మన్మథుడు 2' డిజాస్టర్ అయితే 'కొబ్బరిమట్ట' మాత్రం లాభాలను రాబట్టగలిగింది. దీంతో సంపూ సినిమా బాగానే వర్కవుట్ అవుతుందని భావించిన సినీ నిర్మాతలు కొందరు అతడితో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు సైతం సంపూతో ఓ కామెడీ సినిమా తీయాలని భావిస్తున్నారట. అందులో భాగంగా దర్శకుడు క్రిష్.. సంపూతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈ సినిమాకి క్రిష్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు నిర్మాత సి.కళ్యాణ్ కూడా సంపూతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సంపూర్నేష్ బాబు క్రేజ్ పెరుగుతుందనే చెప్పాలి!