కథకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా పలు రంగాల్లో తన సత్తా చాటుతోన్న కృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తున్నాడు. అలానే బాలీవుడ్ లో ఆయన డైరెక్ట్ చేసిన 'మణికర్ణిక' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత బిజీగా గడుపుతూనే మరోపక్క ధారావాహికల్ని నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే 'స్వాతి చినుకులు' అనే సీరియల్ చాలా పపౌలర్ అయింది. ఇప్పుడు మరో సీరియల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నాడు. 'పల్లెటూరి పిల్ల' అనే పేరుతి క్రిష్ ఓ టీవీ సీరియల్ తెరకెక్కించనున్నారు. దీనికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథని కూడా అందిస్తున్నాడు క్రిష్. ఈ కథ సినిమా నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

ఓ పల్లెటూరి అమ్మాయి హీరోయిన్ గా ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ఉంటుందట. ఓ పక్క సినిమాలు, మరో పక్క సీరియళ్లు ఇలా బిజీబిజీగా గడుపుతున్నాడు క్రిష్. మరి ఈ సీరియల్ కు ప్రేక్షకాదరణ దక్కుతుందో లేదో చూడాలి!