దర్శకుడు క్రిష్ రూపొందించిన 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన వివాదం కొద్దిరోజులుగా నడుస్తూనే ఉంది. మొత్తం షూటింగ్ తాను పూర్తి చేస్తే డైరెక్టర్ గా కంగనా పేరు వేసుకోవడంపై క్రిష్ సంచనలన కామెంట్స్ చేశాడు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన క్రిష్ కి విమర్శలే ఎదురయ్యాయి.

అంతగా అవమానం, విమర్శలు భరించిన క్రిష్ కి కనీసం రెమ్యునరేషన్ కూడా పూర్తిగా అందలేదట. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తంలో ముప్పై శాతం మాత్రమే క్రిష్ కి ఇచ్చారట. మిగిలిన డబ్బుని క్రిష్ అడగనూ లేదు.. వాళ్లు ఇవ్వనూ లేదు.

రెమ్యునరేషన్ ఎందుకు అడగలేదని క్రిష్ ని ప్రశ్నిస్తే.. 'మణికర్ణిక' చిత్ర నిర్మాతకు కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదని, ఆ కారణంగానే రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని క్రిష్ వెల్లడించాడు.

పారితోషికం విషయంలో తాను దర్శకుల సంఘాన్ని ఆశ్రయించి పోరాడవచ్చని కానీ ఇప్పటికే తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే విమర్శించారని.. మళ్లీ రెమ్యునరేషన్ గురించి అడిగి వార్తగా మారాలని అనుకోవడం లేదని క్రిష్ వెల్లడించాడు. తను డబ్బు కోసం ఆలోచించే మనిషిని కాదని అన్నాడు.