ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు వచ్చేసాయి. ఈ రోజు మహానాయకుడు చిత్రం రిలీజైంది. హిట్ లేదా ఫ్లాఫ్ ఇవన్నీ ప్రక్కన పెడితే..దర్శకుడు క్రిష్ నెక్ట్స్ ఏ సినిమా చెయ్యబోతున్నారు...హీరో బాలయ్య కొత్త ప్రాజెక్టు ఎప్పుడు స్టార్టవుతుందనేది ఈ రోజు నుంచి మీడియాలో నలిగే అంశం.

అందుతున్న సమాచారం ప్రకారం.. మ‌హానాయ‌కుడు త‌ర‌వాత క్రిష్ చేయ‌బోయే సినిమా ఏమిట‌న్న‌ది ఇంకా తేలలేదు. ఈ ప్రాజెక్టులో గ‌త కొన్ని నెల‌లుగా తీర‌క లేకుండా గ‌డుపుతున్నాడు క్రిష్‌. ఓ ప్రక్కన మ‌ణిక‌ర్ణిక‌, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలు ఆయనకు క్షణం తీరక లేకుండా చేసాయి. మ‌హానాయ‌కుడు రిలీజ్ అయిన ఈ రోజు నుంచి ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత మెల్లిగా తన తదుపరి ప్రాజెక్టులని ఓ కొలిక్కి తేనున్నారు.  

అయితే అప్పుడైనా ఎవరితో క్రిష్ చేస్తారు అంటే..హీరో ఎవరు చేయబోతున్నారనేది ప్రక్కన పెడితే.. బాహుబ‌లి నిర్మాత‌లైన శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిల‌కు  క్రిష్ ఓ సినిమా చేస్తానని ఎగ్రిమెంట్ చేసారని సమాచారం.

అయితే ఈ లోగా క్రిష్ త‌న సొంత సంస్థ అయిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మేరకు స్టోరీ ఒకటి రెడీ అవుతోందిట. ఆ సినిమా రిలీజ్ తర్వాత వెంటనే.. ఆర్కా మీడియా సినిమా ఉండ‌బోతోంది. ఆర్క్ వాళ్లకు ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తారట. ఆ డేట్స్ కోసం కొద్ది రోజులు ఆగాలిట.

ఇక తమ సొంత బ్యానర్ లో చేయబోయే సినిమా ..స్టారో హీరోతోనా? లేదంటే కొత్త‌వాళ్ల‌తో ముందుకెళ్లాలా? అనే సందిగ్దంలో క్రిష్ ఉన్నారట. త్వ‌ర‌లో క్లారిటీ తెచ్చుకుని  క్రిష్‌సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలతో ప్రకటన చేసే అవకాసం ఉంది.