దర్శకుడు క్రిష్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. క్రిష్ తెరకేకించిన మణికర్ణిక చిత్రం విజయం సాధించినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం కంగన రనౌత్ తీసేసుకుంది. మణికర్ణిక చిత్రం విషయంలో కంగన, క్రిష్ మధ్య వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఎక్కువభాగం తానే తెరకెక్కించానని కంగన చెప్పుకుంది. 

మణికర్ణిక చిత్రం నుంచి తప్పుకుని క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. దీనితో క్రిష్ పై విమర్శలు కూడా తలెత్తాయి. ఓ ఆంగ్ల మీడియాతో క్రిష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపాడు. నేను తప్పటడుగు వేస్తే విరుచుకుపడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అందుకేతదుపరి చిత్రం విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని క్రిష్ తెలిపారు. 

కొంతమంది చీకట్లో ఉంటూ నాపై బాణాలు వేస్తున్నారు.మణికర్ణిక చిత్రాన్ని అంగీకరించడమే తాను చేసిన పెద్ద తప్పు అని క్రిష్ తెలిపారు. కంగనా రనౌత్ వివాదం గురించి నేనేమి మాట్లాడను. ఆమెకు గుడ్ లక్ మాత్రమే చెప్పగలను అని క్రిష్ తెలిపాడు.