విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్‌లుక్ చూడగానే అందరికి  బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఎంటర్టైనర్ 'అర్జున్ రెడ్డి' సినిమా గుర్తొచ్చిన సంగతి తెలిసిందే.అదే ఇప్పుడు కొంప ముంచింది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాకు సాయిం చేస్తున్నాడని అంతటా వినిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లు పుట్టించిన రూమర్ అయ్యిండవచ్చు కానీ, అది మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యిపోయింది.

షూటింగ్ ఇప్పటికే పూర్తైన  ఆ సినిమా అవుట్‌ఫుట్ విషయంలో విజయ్ దేవరకొండ అంత హ్యాపీగా లేడని, అందుకే ఆ సినిమా చూసి అవసరమయిన మార్పులు, చేర్పులు చెప్పమని తన సన్నిహితుడు అయిన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ వంగాకి చెప్పినట్టు టాక్ మొదలైంది.   విజయ్ మాట కాదనలేక సందీప్ కూడా సరే అన్నాడని అందులో భాగంగా చేసిన మార్పులతో సినిమా తయారువుతోందని, ఫస్ట్ లుక్ కూడా సందీప్ సలహాతో వదిలాడని అన్నారు.  అయితే ఇదంతా అబద్దమేనని, మీడియా పుట్టించిన రూమర్ అని దర్శకుడు క్రాంతి మాధవ్ తేల్చి చెప్పారు.

క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.., “ఇలాంటి రూమర్స్ ఎలా పుడతాయో నాకు అర్దం కాదు, మేము ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాం, ఇంకా రెండు షెడ్యూల్స్ పెండింగ్ ఉన్నాయి.ఇంకా ఎడిటర్ టేబుల్ మీదకు వెళ్లలేదు, టీజర్ కట్ చేయలేదు...ఇలాంటి టైమ్ లో ఇలాంటి వార్తలు అంటే ఆశ్చర్యంగా ఉంది” అన్నారు.

రాశి ఖన్నా, క్యాథరిన్ థెరసా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.