‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాకు పనిచేయనున్నాడు. అయితే  ఈ సినిమా ఎలా ఉండబోతుందనే అంశంపై కొరటాల శివ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

కొరటాల శివ రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. ఆతరువాత మెగా ఫోన్ పట్టిన కొరటాల అప్పటి నుంచీ స్టార్ హీరోలతో సినమాలు చేసుకుంటూ వస్తున్నాడు. మెగాఫోన్ పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వస్తున్నారు. చివరిగా ‘భరత్ అనే నేను’ సినిమాతో హిట్ అందుకు కొరటాల నాలుగేండ్ల తర్వాత ఆచార్యతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమా విడుదల అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)తో కలిసి ఎన్టీఆర్ 30 షూటింగ్ పనులు ప్రారంభించనున్నారు. 

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం Acharya మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా హడావుడిలో ఉన్నారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఆచార్య’.. రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. అయితే ఇంత వరకూ కెరీర్ లో ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల. ఆచార్య తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తో కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇండియా మొత్తం ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. మరోవైపు తన అప్ కమింగ్ ఫిల్మ్ ను హిట్ సినిమాల దర్శకుడు Koratala Siva చేతులో పెట్టడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జులైలో NTR30 షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ 30పై కొరటాల శివ ఆసక్తికరంగా కామెంట్ చేశారు. సినిమా ఎలా ఉండబోతోందో ఒక్క ముక్కలో చెప్పాడు. 

ఈ సినిమా చాలా భారీగా ఉంటుందని, డెఫినెట్ గా బోర్డర్స్ దాటేస్తామని అప్పుడు జనతా గ్యారేజ్ చేసే టైం లోనే తారక్ కి చెప్పానని అన్నారు కొరటాల. జనతా గ్యారేజ్ ఎలా ఉన్నా నెక్స్ట్ చేసే సినిమా మాత్రం గట్టిగా ఉంటుందన్నారు. స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు ఇప్పటికే టాక్. కాగా మరింత స్థాయిలో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. మరోవైపు తారక్ కు జంటగా అలియా భట్ (Alia Bhatt)కి బదులు రష్మిక మందన్న నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.