వరుసగా నాలుగు డిజాస్టర్ల తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అమర్ అక్బర్ అంథోని. కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల డైరెక్షన్ కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి. నెక్స్ట్ అతను మరో హీరోతో సినిమా చేయాలి అంటే తప్పకుండా AAA తో హిట్టు కొట్టాలి. 

అదే విధంగా మాస్ రాజా రవితేజ కూడా గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు డిజాస్టర్స్ తో ఈ హీరో మార్కెట్ సన్నగిల్లుతోంది. దీంతో ఈ సినిమా మాస్ రాజాకు కూడా చాలా ఇంపార్టెంట్. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా హిట్టు చాలా అవసరం. స్టార్ హీరోలతో వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న ఈ సంస్థ ఈ మధ్య సవ్యసాచితో సక్సెస్ ట్రాక్ ను మిస్ అయ్యింది.   

దీంతో అమర్ అక్బర్ అంథోని సినిమాతో హిట్టుకొట్టి సక్సెస్ ట్రాక్ ను ఎక్కాలని చూస్తున్నారు. ఇక చాలా కాలం తరువాత తెలుగులో అవకాశం అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా కూడా టాలీవుడ్ లో సక్సెస్ కొట్టి మళ్ళీ బిజీ అవ్వాలని అనుకుంటోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. ఈ నెల 16న సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.