పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్. 

ప్రీమియర్ షోల నుంచి ఆల్రెడీ భీమ్లా నాయక్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలైపోయింది. పవన్ కళ్యాణ్, రానా మధ్య ఇగో క్లాష్ సన్నివేశాలు అల్టిమేట్ గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున ప్రదర్శించిన ప్రీమియర్ షోకి అభిమానులతో కలసి నిర్మాత నాగవంశీ, దర్శకుడు హరీష్ శంకర్ మరికొందరు సెలెబ్రిటీలు హాజరయ్యారు. 

షో పూర్తయిన అనంతరం హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తన స్పందన తెలిపారు. ' కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కళ్యాణ్ ని చూశాను. దర్శకుడు సాగర్ చంద్ర, త్రివిక్రమ్ పనితీరు అద్భుతం. నాగవంశీ గారికి శుభాకాంక్షలు. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తమన్ కెరీర్ లో ది బెస్ట్ వర్క్ ఇచ్చాడు. ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను. ఇది కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు.. భీమ్లా కి బ్యాక్ బోన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రానా గురించి చెప్పాలి. నేను రానాని చూడలేదు.. డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాను. దీని తర్వాత ప్రతి ఒక్కరూ 'రానా.. నీ ఫ్యాన్స్ వైటింగ్ ఇక్కడ అని అంటారు' అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. 

సోషల్ మీడియాలో అభిమానులు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి అంతటి మాస్ హిట్ భీమ్లా నాయక్ అని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. 

భీమ్లా నాయక్ లో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Scroll to load tweet…