Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి భార్య దగ్గర అప్పు చేసిన క్రేజీ డైరెక్టర్.. కోట్ల రెమ్యునరేషన్ వస్తున్నా ఇంకా ఎందుకు తీర్చలేదంటే..

టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. హను చివరగా సీతా రామం చిత్రంతో ఎంత పెద్ద విజయం సొంతం చేసుకున్నారో చూశాం. భావోద్వేగమైన ప్రేమ కథకి దేశ భక్తి జోడించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు.

Director Hanu Raghavapudi takes money from Rajamouli wife Rama Rajamouli dtr
Author
First Published Aug 24, 2024, 10:57 AM IST | Last Updated Aug 24, 2024, 10:57 AM IST

టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. హను చివరగా సీతా రామం చిత్రంతో ఎంత పెద్ద విజయం సొంతం చేసుకున్నారో చూశాం. భావోద్వేగమైన ప్రేమ కథకి దేశ భక్తి జోడించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. హను రాఘవపూడి తదుపరి ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. 

దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్ గా కనిపించబోతున్నారు. హను రాఘవపూడి అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రాన్ని రాజమౌళి నిర్మించిన సంగతి తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో హనుకి రాజమౌళి నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 

ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో హను తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు పడ్డాయి. సీతారామం చిత్రంతో మళ్ళీ పుంజుకున్నారు. ఇప్పుడు హను కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. 

అయితే హను ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిపారు. షార్ట్ ఫిలిం తీసేందుకు కూడా హను దగ్గర డబ్బులు లేవట. దీనితో హను.. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశారట. ఇంతవరకు ఆ అప్పు చెల్లించలేదని హను సరదాగా తెలిపారు. ఎందుకు తిరిగి ఇవ్వలేదు అని అడిగితే.. కొన్ని రుణాలు ఆలాగే ఉంచుకుంటే బావుంటుంది అని తెలిపారు. ఆ అప్పు ఎప్పటికీ చెల్లించనని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios