ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గోపీచంద్ మలినేని తండ్రి వెంకటేశ్వర్లు చౌదరి ఆదివారం రోజు మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం విషమించడంతో వెంకటేశ్వర్లు చౌదరి ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

తన కొడుకు డైరెక్టర్ గా రాణిస్తున్నప్పటికీ వెంకటేశ్వర్లు చౌదరి ఒంగోలు లోని స్వగ్రామం బొద్దులూరి వారి పాలెంలో నివసిస్తున్నారు. ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులంతా గోపీచంద్ కు సానుభూతి తెలియజేస్తున్నారు. 

గోపీచంద్ దర్శకుడిగా డాన్ శీను, పండగ చేస్కో, బలుపు, బాడీగార్డ్ లాంటి సివిజయవంతమైన చిత్రాలని తెరక్కించారు. సాయిధరమ్ తేజ్ తో తెరక్కించిన విన్నర్ చిత్రం నిరాశపరిచిన తర్వాత గోపీచంద్ తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు.