మెగాస్టార్ తో మెమొరబుల్ పిక్!

First Published 8, Jun 2018, 11:11 AM IST
director gopichand malineni shared memorable photo with megastar chiranjeevi
Highlights

'బలుపు','పండగ చేస్కో' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని 

'బలుపు','పండగ చేస్కో' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని ప్రస్తుతం  తన తదుపరి చిత్రం కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. తాజాగా ఈ దర్శకుడు సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. డైరెక్టర్ కాకముందు అసోసియేట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన గోపీచంద్ మలినేని మెగాస్టార్ నటించిన 'స్టాలిన్' సినిమాకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

షూటింగ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మురుగదాస్ లతో కలిసి తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. 'నా స్నేహితుల్లో ఒకరు ఈ ఫోటోను పంపించారు. మెగాస్టార్ తో మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్' అంటూ ట్వీట్ చేశారు.  

 

loader