Asianet News TeluguAsianet News Telugu

'వీరసింహా రెడ్డి'కు అలా దెబ్బ పడి,కలెక్షన్స్ తగ్గుతున్నాయా?

రిలీజైన థియేటర్స్ మేరకు వీర  సింహా రెడ్డి కుమ్మేస్తోంది. ఈ కాంపిటేషన్ లో గెలవాలంటే, కలెక్షన్స్ మరింతగా పెరగాలంటే ఖచ్చితంగా థియేటర్స్ సంఖ్య పెరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. 

Director Gopichand Malineni fires on distributors for Veera Simha Reddy
Author
First Published Jan 16, 2023, 1:01 PM IST

ఏ సినిమా సక్సెస్, కలెక్షన్స్ ...అవి రిలీజైన థియేటర్స్ సంఖ్య, మంచి సెంటర్లో ఉండే థియేటర్స్ ని బట్టి ఆధారపడుతుందని ట్రేడ్ అంటుంది. అది నిజం కూడా. అందుకే పెద్ద సినిమా వాళ్లు తమ సినిమాలను సరైన థియేటర్స్ లో ,అదీ ఎక్కువ సంఖ్యలో ఉండేలా చూసుకుంటారు. అయితే సంక్రాంతి సీజన్ లో అది సాధ్యం కాదు. థియేటర్స్ ఎంపిక చాలా క్లిష్టంగా మారుతుంది. ఈ సంక్రాంతికి అది మరీ ఎక్కువైంది. చిరంజీవి, బాలయ్య అభిమానులు ఈ విషయమై దిల్ రాజు పై మండిపడ్డారు కూడా. ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తన సినిమాను ఈ పెద్ద హీరోల రిలీజ్ తర్వాతే పెట్టుకున్నారు. 

ఇక  విషయానికి వస్తే... సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. థియేటర్ల దగ్గర ఆ రోజు అర్థరాత్రి నుంచే బాలయ్య అభిమానులు హంగామా చేసారు.  హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. క్రాకర్స్ కాలుస్తూ.. డప్పులు, డ్యాన్స్ లతో హంగామా సృష్టించారు. థియేటర్ వద్ద బాలయ్య బాబు,గోపి చంద్ మలినేని సహా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమా చూశారు. అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. అంతా హ్యాపీగా జరిగింది. అయితే ఒక రోజు తేడాలో రిలీజైన వాల్తేరు వీరయ్యకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. 

 అయితే  ఇందుకు కారణం వాల్తేరు వీరయ్య కన్నా వీర సింహా రెడ్డి కు థియేటర్స్ ఎలాట్ చేయటం తగ్గిందని దర్శక,నిర్మాతలు  ఫీలవుతున్నారని మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. రిలీజైన థియేటర్స్ మేరకు వీర  సింహా రెడ్డి కుమ్మేస్తోంది. ఈ కాంపిటేషన్ లో గెలవాలంటే, కలెక్షన్స్ మరింతగా పెరగాలంటే ఖచ్చితంగా థియేటర్స్ సంఖ్య పెరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. దాంతో డిస్ట్రిబ్యూషన్ సైడ్ ...థియేటర్స్ పెంచమని ఆయన నిర్మాతలను అడుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

మరో ప్రక్క ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది.  ఈ చిత్రం సైతం మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. 

మరో ప్రక్క బాలయ్య 'అన్ స్టాపబుల్ 2' వేదికపై 'వీరసింహా రెడ్డి' టీమ్ సందడి చేసింది. బాలయ్య...గోపీచంద్ మలినేని పడిన స్ట్రగుల్స్ గురించి అడిగారు. అందుకు గోపీచంద్ మలినేని స్పందిస్తూ .. 'క్రాక్' సినిమాకి ముందు రెండేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డాను. నాకున్న కొద్ది పాటి ఆస్తులను కూడా అమ్మేశాను. ఆ సమయంలో మన శ్రేయోభిలాషులెవరు? అనే విషయం నాకు అర్థమైంది" అని అన్నారు.

"ఇండస్ట్రీలో నిలబడాలంటే సక్సెస్ ఉండాలి .. అది లేకపోతే ఎవరూ మనవెంట ఉండరు. అందువల్లనే సక్సెస్ ఎంత ముఖ్యమైనదనేది తెలుసుకున్నాను. అప్పటి నుంచి మరింత హార్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఇకపై అలాంటి కష్టాలు రావని నేను అనుకుంటున్నాను  .. ఎందుకంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను" అంటూ ఎమోషనల్ అయ్యారు.  

Follow Us:
Download App:
  • android
  • ios