వినూత్న కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు చందు మొండేటి. ఇప్పుడు అతని నుంచి వస్తోన్న మరో చిత్రం సవ్యసాచి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి చందు బారి బడ్జెట్ సినిమాను వదులుతున్నాడు. సవ్యసాచి కోసం అతను పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు రిలీజ్ టెన్షన్ లో ఉన్న చందు సినిమా గురించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. 

ముఖ్యంగా సినిమా కథ రాసుకున్నప్పుడే సవ్యసాచి టైటిల్ అనుకున్నట్లు చెప్పాడు. ఇక సినిమా హలో బ్రదర్ తరహాలో ఉంటుందనే టాక్ ను చందు కొట్టిపారేశారు. సినిమా ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు అనిపించవచ్చు కానీ హలో బ్రదర్ కి సవ్యసాచికి ఎలాంటి పోలికలు ఉండవని క్లారిటీ ఇచ్చాడు. ఇక మాధవన్ 40నిమిషాల కథ వినగానే సినిమా ఒకే చేశారని ఆయన పాత్ర తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని చెప్పారు. 

ఇక సినిమాలో 'నిన్ను రోడ్డు మీద చూసినప్పుడు' పాటను రీమేక్ చేయడానికి కారణం ఉంది. సినిమా సెకండ్ హాఫ్ చాలా సీరియస్ నోట్ తో సాగుతుంది. ఆ టైమ్ లో కొంచెం జోష్ వచ్చేలా ఉండాలని కరెక్ట్ టైమ్ లోనే సాంగ్ ను సెట్ చేసినట్లు దర్శకుడు వివరించాడు. నవంబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా కీరవాణి సంగీతమందించారు.