Asianet News TeluguAsianet News Telugu

నా ప్రశ్నలకు జైలు అధికారుల వద్ద సమాధానం లేదంటున్న దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి

`నేను అడిగిన ప్రశ్నలకు పలు జైలు అధికారుల వద్ద సమాధానం లేదంటున్నారు బ్రిలియెంట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి. చాలా మంది అధికారులు జైలు లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో నాకు నేనే జైలు రూల్స్,  ఖైదీల యూనిఫాం సృష్టించానని అంటున్నారు చంద్ర శేఖర్‌ యేలేటి. 

director chandra shekar yeleti bold interview about nithin check movie arj
Author
Hyderabad, First Published Feb 20, 2021, 2:40 PM IST

`నేను అడిగిన ప్రశ్నలకు పలు జైలు అధికారుల వద్ద సమాధానం లేదంటున్నారు బ్రిలియెంట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి. చాలా మంది అధికారులు జైలు లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో నాకు నేనే జైలు రూల్స్,   ఖైదీల యూనిఫాం సృష్టించానని అంటున్నారు చంద్ర శేఖర్‌ యేలేటి. ఆయన ప్రస్తుతం `చెక్‌` చిత్రాన్ని రూపొందించారు. నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం దర్శకుడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

`చెక్‌` సినిమా పదేళ్లనాటి ఐడియా అని, అది అనేక రకాలుగా మారి ఈ చిత్రంగా బయటకు వచ్చిందన్నారు చంద్రశేఖర్‌ యేలేటి. ఇందులో స్క్రీన్‌ప్లే అందరికి నచ్చుతుందని చెప్పారు.  `సినిమాలో హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ,  బాగా తెలివైన వ్యక్తి. రోడ్లు మీద తిరగడు. క్రెడిట్ కార్డ్స్, ఫ్రాడ్స్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలోపడితే? జైలులో పడితే ఉరిశిక్ష పడితే? ఏం చేశాడనేది ఆసక్తికరం. తెలివైన వ్యక్తం నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అతను ఫ్రీగా ఉన్నప్పుడు తెలివితేటలు తప్పుడు దారికి ఉపయోగపడింది. జైలులో ఎవరో పరిచయం అవ్వడంతో అతని బుర్ర సరైన దారిలో పడిందనేలా ఇందులో చూపించామన్నారు. 

నేను ఏ సినిమా చేసినా, ఆ జోనర్‌ చిత్రాలను చూడను. సినిమా చేశాక చూస్తానన్నారు. ఇందులో చెస్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి లాస్ట్ అప్షన్, క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోవడం. రాష్ట్రపతి దగ్గర చాలా పిటిషన్లు ఉంటాయి. అప్పటి పరిస్థితుల బట్టి ఒకరిద్దరికి క్షమాభిక్ష ఇస్తారు. ఆ యాంగిల్ ఒకటి తీసుకున్నాం. హీరో చెస్ బాగా ఆడతాడు. వరుసపెట్టి విజయాలు సాధిస్తుంటే అతడిపై సానుభూతి కలగవచ్చు. రాష్ట్రపతి దగ్గర అభిప్రాయం మారవచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో సన్నివేశాలు ఉంటాయి. సినిమా డెబ్బై శాతం జైలులో సాగుతుందన్నారు. 

నితిన్‌తో మరో సినిమాల చేయాల్సి ఉంది. అది వర్కౌట్‌ కాలేదని, ఈ సినిమాకి ఆయన సూట్‌ అవుతాడనిపించి చేశానని చెప్పారు. కళ్యాణ్‌ మాలిక్‌ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందన్నారు. తమ సినిమాలో జైలు, యూనిఫామ్‌ పూర్తిగా కల్పితమని చెప్పారు. ఈ సినిమా కోసం కొన్ని జైళ్లకి వెళ్లారట. అవి హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తాయి కనుక చూడటానికి అనుమతులు ఇవ్వడం లేదని, జైలులో విధానాలపై మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. అంటే... తీవ్రవాదులను ఎలా తీసుకువెళతారు? ఎలా పెడతారు? వంటి విషయాలు చెప్పడానికి ఓపెన్ గా లేరు. కాన్ఫిడెన్షియల్ మేటర్ కాబట్టి అర్థం చేసుకోగలనని తెలిపారు. 

అయితే ఫరీద్ కోట్ నుండి విశాఖ వరకు ఐదారు జైళ్లకు వెళ్ళామని, సాధారణ ఖైదీలను చూపిస్తున్నారు. అక్కడ నుంచి ముందుకు వెళ్లడం లేదు. కొంతమంది ఖైదీలను ఎక్కడ పెట్టారు? ఎటువంటి భోజనం ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తే సమాధానాలు రాలేదని చెప్పారు చంద్రశేఖర్‌ యేలేటి. ఇక తాను ఎక్కువగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి పొందుతానని, ఫిక్షన్ తీసుకోనని వెల్లడించారు. అయితే దర్శకుడిగా అతిగా అప్‌డేట్‌గా ఉండడం కూడా కరెక్ట్ కాదంటున్నారు యేలేటి.

`నా సినిమాలు విడుదలైన రెండు మూడేళ్ల తర్వాత ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. 'సినిమాలో అది బావుంది' అని చెప్తారు. అడ్వాన్స్డ్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి.

 ఈ సినిమాతో నేను అనుకున్న దాంట్లో డెబ్బై శాతం అవుట్‌పుట్‌ వచ్చిందని భావిస్తు`న్నట్టు చెప్పారు. ఇందులో రకుల్‌ భయస్తురాలైన లాయర్‌గా కనిపిస్తుందని, నితిన్‌ కేసువాధిస్తుందట. అలాగే ప్రియా ప్రకాష్‌ వారియర్‌, ఆయనకు లవర్‌గా చేస్తుందని, ఈ కథకి మూలం ఆమె పాత్ర నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఫైనల్‌గా ఈ సినిమా డిజప్పాయింట్‌ చేయదన్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయన్నారు దర్శకుడు యేలేటి.

Follow Us:
Download App:
  • android
  • ios