డైరక్టర్ బాబి నెక్ట్స్ ప్రాజెక్టు సెట్ చేస్తున్న చిరు?
మైత్రీ వారు కూడా తమ బ్యానర్ లో చేయాలంటున్నట్లు సమాచారం. అయితే బాబి మాత్రం తన తదుపరి చిత్రం మెగా క్యాంప్ లోనే చెయ్యాలనుకుంటున్నట్లు సమాచారం. ఆ మెగా హీరో ఎవరూ..

మెగాస్టార్ తో చేసిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసిన బాబీ పేరు మారుమ్రోగుతోంది. మెగాభిమానులు బాసును ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ బాబీ అంటున్నారు. చిరంజీవి సైతం బాబిని తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బాబి తదుపరి ఏ హీరోతో చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. బాబికి స్టార్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మైత్రీ వారు కూడా తమ బ్యానర్ లో చేయాలంటున్నట్లు సమాచారం. అయితే బాబి మాత్రం తన తదుపరి చిత్రం మెగా క్యాంప్ లోనే చెయ్యాలనుకుంటున్నట్లు సమాచారం. ఆ మెగా హీరో ఎవరూ..
అందుతున్న సమాచారం మేరకు బాబి తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయాలని ఆశపడుతున్నాడట. చిరంజీవి సైతం ఓ మంచి కథతో రామ్ చరణ్ కు కమర్షియల్ హిట్ ఇవ్వాలని చెప్పారట. దాంతో ఆ మేరకు కసరత్తులు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతోంది. ఆ సినిమా తర్వాత యువి సంస్థకు ఓ సినిమా చేయబోతుున్నారు చరణ్. కన్నడ డైరెక్టర్ నర్తన్ (Narthan), రామ్ చరణ్ కాంబినేషన్‌లో మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. నర్తన్ ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. నర్తన్ గతంలోనే రామ్ చరణ్‌కు స్టోరీని వినిపించాడు. ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్టు మాత్రం మెటీరియలైజ్ కాలేదు. ఈ సినిమా ఖరారు కాకపోతే బాబితో రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). రంగస్థలం సినిమాతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సీ 15’ (RC15)లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నెలలో సగం రోజులు మాత్రమే ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుంది. అందువల్ల కొత్తగా కథలు వింటున్నాడు. ఈ మధ్యనే బుచ్చి బాబు సానా దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసే పనిలో పడ్డాడు.