ఎన్టీఆర్ జైలవకుశ రిలీజ్ రోజు చిరంజీవి ఏంచేశారో తెలుసా..

First Published 20, Nov 2017, 8:42 PM IST
director bobby reveals a secret about mega star chiranjeevi
Highlights
  • జై లవకుశ సినిమాతో హిట్ కొట్టిన బాబీ
  • బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జైలవకుశలో ఎన్టీఆర్ హీరో
  • ఎన్టీఆర్ మూవీ విడుదల రోజు దర్శకుడు బాబీ ఇంటికి మెగాస్టార్
  • ఇంతకీ ఎన్టీఆర్ జైలవకుశ రోజు  మెగాస్టార్ బాబీ ఇంటికి ఎందుకెళ్లారు?

పవర్‌, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, ‘జై లవకుశ లాంటి హిట్ సినిమాలు తీసిన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బాబీ. బాబీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జై లవకుశ హిట్ పై స్పందిస్తూ.. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నాడు బాబీ. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గురించిన ఓ విషయం వెల్లడించారు. అది ఎన్టీఆర్ అభిమానులను సైతం షాక్ కు గురిచేసింది.

 

‘జై లవకుశ’ పాత్రల్లో ఎన్టీఆర్‌ని తప్ప మరెవ్వరినీ వూహించలేను. మరీ ముఖ్యంగా ‘జై’గా చెలరేగిపోయారు. ‘మా ఎన్టీఆర్‌ని చాలా కొత్తగా చూపించారు’ అని ఆయన అభిమానులంతా అంటుంటే నా ఆనందానికి అవధుల్లేవు’’. ఇక ‘జై లవ కుశ’ విడుదల రోజు చిరంజీవి మా ఇంటికొచ్చారు అని చెబుతూ ఆ విషయాలు ఇలా పంచుకున్నారు.

 

నేను బేసిక్ గా చిరు ఫ్యాన్‌ ని.  మా నాన్న నాకంటే పెద్ద అభిమాని. చిరంజీవి సినిమా విడుదలైతే అందరికంటే ముందు నాన్న తయారై పోయేవారు. ఆమధ్య నాన్నగారి ఆరోగ్యం పాడైంది. ‘ఏరా.. చిన్నప్పుడు నీకు అన్ని చిరంజీవి సినిమాలు చూపించా. నాకు ఆయన్ని చూపించవా’ అని అడిగారు. అలా అనేసరికి నాకు చాలా బాధేసింది.

 

ఏంచేయాలో అర్థంకాక పాజిబిలిటీ ఏమైనా వుందేమోనని... వినాయక్‌ గారికి విషయం చెప్పా. సరిగ్గా అరగంటలో ఆయన్నుంచి ఫోన్.. ‘చిరంజీవి గారే మీ ఇంటికి వస్తున్నారు’ అని. ‘వద్దుసార్‌.. మేమే వస్తాం’ అని వినయ్‌ గారికి చెప్పా. కానీ ఆయన వినలేదు. ‘జై లవ కుశ’ విడుదల రోజున చిరంజీవిగారు మా ఇంటికి వచ్చి మాతో రెండుగంటల పాటు గడిపారు. నాన్నకి నేనిచ్చిన అత్యంత విలువైన గిఫ్ట్‌ అదే అంటూ బాబీ సంతోషం వ్యక్తపరిచారు.

loader