దర్శకుడు బాలాకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలని ఆరాటపడుతుంటారు. అటువంటి వ్యక్తికి అవమానం జరిగింది. ఆయన తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' రీమేక్ ఫైనల్ అవుట్ బాగాలేదని పక్కన పెట్టేశారు.

మరో దర్శకుడితో సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ కూడా మూడు నెలల్లో పూర్తయింది. ఇంత ఫాస్ట్ గా సినిమా ఎలా కంప్లీట్ చేశారా..? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదే అనుమానంతో బాలా తను తీసిన వెర్షన్ లో ఏవైనా సన్నివేశాలు వాడుకున్నారేమోనని హీరో విక్రమ్ తో పాటు నిర్మాణ సంస్థలకు నోటీసులు పంపించారట.

తను తీసిన వెర్షన్ లో సన్నివేశాలను వాడుకుంటే గనుక చట్టరీత్యా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి బాలాని ప్రాజెక్ట్ నుండి తప్పించిన తరువాత  హీరోయిన్ గా మరో అమ్మాయిని తీసుకున్నారు.

హీరో ధృవ్ లుక్ లో మార్పులు చేశారు. ఆ ప్రకారంగా చూసుకుంటే సన్నివేశాలు వాడుకునే ఛాన్స్ లేదు. కానీ దేనికైనా మంచిదని ముందే బాలా నోటీసులు ఇచ్చేసినట్లున్నారు.