జవాన్ చిత్రానికి 40 కోట్ల బడ్జెట్ కూడా పెట్టరు అనుకున్నా.. అలాంటిది 300 కోట్లు ఖర్చు చేశారు: అట్లీ
కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో జవాన్ చిత్రం అనేక రికార్డులు తిరగరాస్తోంది.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. షారుఖ్ లక్కీ లేడీ దీపికా కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం బిగ్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ శుక్రవారం రోజు సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షారుఖ్, అట్లీ, విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతితో పాటు దీపికా కూడా హాజరైంది.
ఈ ఈవెంట్ లో అట్లీ మాట్లాడుతూ జవాన్ బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జవాన్ చిత్రాన్ని నేను షారుఖ్ ఖాన్ కి రాసిన ప్రేమ లేఖగా భావిస్తాను. నేను రచయితగా, దర్శకుడిగా ఏ చిత్రాన్ని తెరకెక్కించను. సినిమా అభిమానిగా మాత్రమే ప్రతి చిత్రాన్ని రూపొందిస్తాను అని తెలిపారు. కోవిడ్ టైంలో షారుఖ్ ఖాన్ కి ఈ కథ చెప్పాను.
అప్పటి పరిస్థితులు చూస్తే ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుందా.. జనాలు ఇకపై థియేటర్స్ కి వస్తారా అనే అనుమానం కలిగింది. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు కనీసం 40 కోట్ల బడ్జెట్ అయినా పెట్టగలరా అంటూ నాలో అనేక సందేహాలు. కానీ జవాన్ చిత్ర బడ్జెట్ 300 కోట్లు దాటిపోయినట్లు అట్లీ వివరించారు. దర్శకుడిగా నా దగ్గర ఎలాంటి ఫార్ములాలు ఉండవు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు, సామజిక అంశాలతోనే ఏ కథ అయినా చిత్రంగా తెరకెక్కిస్తాను అని అట్లీ అన్నారు.