మెగా మేనల్లుడిగా కెరీర్ ప్రారంభంలోనే మంచి ఫాలోయింగ్‌  తెచ్చుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌.  మొదట్లో ఫుల్‌ జోష్‌లో ఉన్న  ఈ హీరో.. ఈ మధ్య వరస ఫ్లాఫ్ లతో  కాస్త తడబడ్డాడు.  ఏ డైరక్టర్ తో చేసినా, ఎలాంటి కథ చేసినా  ఈ మెగా హీరోకు అస్సలు కలిసి రావడం లేదు. ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.  ‘నేను శైలజా’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లో ‘చిత్రలహరి’ అనే సినిమాను చేస్తున్నాడు.  ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ఓ సోషియో ఫాంటసీ చిత్రం ఓకే చేసినట్లు సమాచారం.

జగదేక వీరుడు ..అతిలోక సుందరి తరహాలో సాగే కథతో దర్శకుడు అశోక్ సంప్రదించాడని, ఆ కథను విన్న సాయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అశోక్ రీసెంట్ గా భాగమతి చిత్రం అనుష్కతో చేసారు. ఫరవాలేదనిపించుకున్న ఈ చిత్రం తర్వాత అశోక్ కు గ్యాప్ వచ్చింది. 

ఈ లోగో ఓ ఫాంటసీ లైన్ ని తీసుకుని వర్క్ చేసి, సాయిని ఒప్పించుకున్నాడంటున్నారు. అదే కనుక పట్టాలు ఎక్కితే తన కెరీర్ మారుతుందని భావిస్తున్నాడు. అయితే బడ్జెట్ బాగా ఎక్కువగా ఉందని, ఎంతవరకూ దాన్ని కంట్రోలు చేయగలుగుతామో ప్రస్తుతం చర్చిస్తున్నారు. త్వరలో ఫైనలైజ్ చేసి ప్రకటన వచ్చే అవకాసం ఉంది. 

మరో ప్రక్క చిత్రలహరి చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలని.. అందులోనూ ఏప్రిల్‌ 19న చేయాలని అనుకున్నట్లు సమాచారం.   మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.