అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన `ఎఫ్3` సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా నెగటివ్ టాక్‌లపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సినిమా నెగటివ్ టాక్‌లపై దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) స్పందించారు. ఆయన అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం వచ్చిందంటే సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో అనే భయం స్టార్ట్ అయ్యిందని, ప్రతి సినిమాకి నెగటివిటీ ఎక్కువైపోయింద`ని తెలిపారు. నవ్వుకునే సినిమా వచ్చింది. ప్రశాంతంగా నవ్వుకోండని, పాజిటివ్‌గా ఉండాలని, అనసవరంగా అది తక్కువ, ఇది తక్కువ అంటూ లాజిక్‌లు వెత్తుక్కోవడం ఎందుకు.సినిమాకి వెళ్లి హ్యాపీగా నవ్వుకోవాలని, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్` అని తెలిపారు దర్శకుడు. తాను రూపొందించిన `f3` సినిమాకి వస్తోన్న టాక్‌ని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేయడం విశేషం.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన `ఎఫ్3` సినిమా శుక్రవారం విడుదలైంది. వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. సోనాల్ చౌహాన్ కీలక పాత్ర చేశారు. మనీ నేపథ్యంలో వచ్చే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. దిల్‌రాజు నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలైన నేపథ్యంలో పాజిటివ్ టాక్ వస్తోందని చెబుతోంది యూనిట్. ఈ మేరకు మధ్యాహ్నం టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అంతకు ముందు పలు థియేటర్లలో సందడి చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో థియేటర్లలో ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందనని పంచుకున్నారు. ‘ఎఫ్ 3`ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు అనిల్ రావిపూడి. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుందన్నారు. `ప్రేక్షకులు థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు. `ఎఫ్ 2` కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఒక స్టార్ ఇమేజ్ ఉండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. `ఎఫ్ 3`ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి’ అని పేర్కొన్నారు.
హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. కుటుంబమంతా కలిసొచ్చి `ఎఫ్ 3`ని ఎంజాయ్ చేస్తున్నారు. `ఎఫ్ 2` తర్వాత నేను థియేటర్‌కి వెళ్లి చూసిన సినిమా `ఎఫ్ 3`నే. దేవి థియేటర్లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్‌టైనర్ తీసుకునందుకు సంతోషంగా ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్ 3కి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి `ఎఫ్ 3`ని ఎంజాయ్ చేయాల`ని చెప్పారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. `ఎఫ్ 3`తో మరో బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ మూవీ మాకు చాలా ప్రత్యేకమైనంది. వెంకటేష్ గారి `సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ఎఫ్ 2`, ఇప్పుడు `ఎఫ్ 3`తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో `ఫిదా`, `ఎఫ్ 2`, ఇప్పుడు `ఎఫ్ 3` హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం` అని చెప్పారు. ఈ సందర్భంగా యూనిట్ కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు దీనిపై నెటిజన్ల నుంచి సెటైర్లు వస్తున్నాయి. సినిమా పోయిందా అప్పుడే సక్సెస్ మీట్ పెట్టారంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
