ఎఫ్ 2 వంటి కామెడీ చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడాయన సూపర్ స్టార్ మహేష్ తో చిత్రం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఓ  రేంజిలో ఉంటాయని ఎక్సపెక్ట్ చేయచ్చు. మహర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత మహేష్ చేస్తున్న ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి సెట్స్ కు మీదకు వెళ్లే ఈ చిత్రం కోసం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు దర్శకుడు అనీల్ రావిపూడి. 

ఆ ట్వీట్ మొత్తం ఎమోజీలతో నిండి ఉంది. ఈ ఎమోజీలు చూస్తూంటే ఈ సినిమాపైన అతని కాన్ఫిడెన్స్ ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఎమోజీలను డీకోడ్ చేసాం. వచ్చి అర్దం ఏమిటంటే “ స్క్రిప్టు చాలా అద్బుతంగా వచ్చింది.  రచన పూర్తైంది. అది ఫైర్ లాగ వెలుగుతోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది” అని. 

సూపర్‌స్టార్‌ కృష్ణ 31న తన 76వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.  ఆయనకు బర్త్‌డే కానుకగా తన 26వ సినిమా గురించి ప్రకటించబోతున్నట్లు చెప్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్‌ నుంచి షూటింగ్ మొదలవుతుంది. అనిల్‌ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారు. 

‘దూకుడు’, ‘f2’ లాగే ఈ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ‘మహర్షి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న మహేష్ .. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఎంజాయ్‌ చేస్తున్నారు.