తమిళంలో 'ఇరుముగన్' అనే సినిమాతో పేరు సంపాదించుకున్న దర్శకుడు ఆనంద్ శంకర్ అదే సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశాడు. రీసెంట్ గా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా' అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాడు.

ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ డీలా పడక తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు ఆనంద్ శంకర్. తాజాగా ఆయన తన గర్ల్ ఫ్రెండ్ తో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు.

తనకి చాలా సిగ్గని కానీ మొదటిసారి తన ప్రైవేట్ లైఫ్ ఫోటోలను షేర్ చేస్తున్నట్లు వెల్లడించారు. తన గర్ల్ ఫ్రెండ్ తో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. చాలా కాలంగా ప్రేమిస్తోన్న తన ప్రేయసికిప్రపోజ్ చేసినట్లు దానికి ఆమె అంగీకారం తెలిపినట్లు వెల్లడించాడు.

''నా ప్రైవేట్ లైఫ్ గురించి మొట్టమొదటి పోస్ట్ ఇది. సాధారణంగా నేను ఓపెన్ గా ఉండలేను. అలానే సిగ్గు కూడా చాలా ఎక్కువ. అయినప్పటికీ నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని భావించాను. మీ అందరి దీవెనలు నాకు ఎప్పటికీ కావాలి. దుబాయి 2018, హ్యాపీ దీపావళి'' అని ట్వీట్ పెట్టాడు.