శ్రీ రెడ్డి.. జీఎస్టీ 2 తీద్దామా.. అంటున్న దర్శకుడు

director ajay koundinya wants to make GST2 with sri reddy
Highlights

శ్రీ రెడ్డి.. జీఎస్టీ 2 తీద్దామా.. అంటున్న దర్శకుడు అజయ్ కౌండిన్య

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కు సంబధించిన చీకటి భాగోతాన్ని హాలీవుడ్ లో మొదలుపెట్టి టాలీవుడ్ దాకా హిరోయిన్లు తమ అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు సంబంధించి సంచలన విషయాలు  బయటపెట్టిన హిరోయిన్ శ్రీరెడ్డిపై వివాదాస్పద కామెంట్ చేశారు భూత్ బంగ్లా మూవీ దర్శకుడు అజయ్ కౌండిన్య. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యుసర్లను బ్రోకర్లుగా అభివర్ణిస్తూ శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్‌పై మండి పడ్డారాయన. శ్రీరెడ్డి అసలు నీకు కామన్‌సెన్స్ ఉందా? శ్రీరెడ్డి అనే ఒక నటి ఉందని ప్రజలకు తెలిసిందంటే అది డైరెక్టర్లు ప్రొడ్యుసర్ల గొప్పతనమే అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 15 ఏళ్లలో నన్ను వాడు వాడుకున్నాడు, వీడు వాడుకున్నాడు, ఇంకొకడు న్యూడ్ వీడియోలు పంపరాన్నాడంటూ నానా రచ్చ చేస్తున్నావు కదా అయితే నీకు ఇష్టం లేకపోతే మొదట్లోనే వెళిపోవచ్చు కదా? బయట జాబ్ చేసుకోవచ్చుకదా అన్నారు. 


తెలుగు పరిశ్రమకు వచ్చిన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని నానా హంగామా చేస్తున్నారు కాని.. ఓ సినిమా తీయడంలో నిర్మాత పడే కష్టం నీకు తెలుసా? అన్నారు. తమన్నాని పెట్టుకుంటారు.. ఇంకో హీరోయిన్‌ని పెట్టుకుంటారు అంటున్నావ్.. వాళ్లను పెట్టుకుంటేనే నిర్మాతకు నాలుగు డబ్బులు వస్తాయ్.. నిన్ను పెట్టుకుంటే ఎవడు చూస్తాడు? నువ్ ఎవరికి తెలుసు? నువ్వే చెప్తున్నావ్ నేను పోర్న్ స్టార్ అని చెప్తున్నావ్. అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నాకు లీడ్ క్యారెక్టర్ కావాలని అడగడానికి నువ్ ఎవరివి అసలు? ఓ పాత్రకు ఎవర్ని పెట్టుకోవాలో అది దర్శకుడి ఇష్టం. ఆ పాత్రకు సరిపోయే వాళ్లను అతడు పెట్టుకుంటాడు? నువ్ నాకు పలానా పాత్ర కావాలని ఎలా డిమాండ్ చేస్తావ్ అన్నారు. 

 

నువ్ అన్నట్టు నిజంగానే ఆ నిర్మాత బుద్ది గడ్డితిని నిన్ను ఏదో అడిగాడే అనుకుందాం. ఇది ఇండస్ట్రీలో తరతరాలుగా వస్తుందన్ని విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రీరెడ్డి ఇది ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనో కాదు ప్రతి ఫీల్డ్‌లోనూ నడుస్తోందన్నారు. ఓ ప్రొడ్యుసర్ నీ న్యూడ్ వీడియోలు అడిగాడని అంటున్నావ్.. నీకు దమ్ముంటే ఆప్రొడ్యుసర్ ఎవరో చెప్పు. ఆ వీడియోలను నువ్ రివీల్ చేయి. టీవీ ఛానల్స్ ఆ వీడియోలను ప్రసారం చేయలేకపోతే నువ్వే నీ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయి... అంతేకాని ఈ ముసుగులో గుద్దులాట వద్దు అన్నారు. నువ్ టీవీలకు ఎక్కి మాట్లాడుతున్న భాష సరైనదేనా అన్నారు. టీవీలను ఎంతో మంది చిన్న పిల్లలు చూస్తున్నారన్న కామన్ సెన్స్ ఉందా అన్నారు.

 

ఇన్నాళ్లు నిన్ను వాడుకున్నారని అంటున్నావ్.. కాని వాళ్లు పెట్టిన ఫుడ్ తిన్నావ్.. వాళ్లతో పబ్‌లకు వెళ్లావ్.. వాళ్ల కార్లలో తిరిగావ్... ఫారిన్ ట్రిప్స్‌కి వెళ్లావ్.. కార్లు గిఫ్ట్ ఇస్తే తీసుకున్నావ్... పదిహేనేళ్లుగా వాళ్లు ఏమిస్తే అన్నీ తీసుకున్నావ్ ఇప్పుడు వాళ్లని రోడ్డు మీద పెట్టేస్తావా? సరే నువ్ అడిగనట్టే నీకు ఇప్పటి వరకూ ఏ దర్శకుడు ఇవ్వని బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. శ్రీరెడ్డికి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆమెతో జీఎస్టీ 2 తీస్తా.. నేషనల్ అవార్డ్ వచ్చే కత్తిలాంటి స్టోరీ నా దగ్గర ఉంది. ఆ క్యారెక్టర్ కోసం హీరోయిన్‌ని వెతుకుతున్నా.. కరెక్ట్ టైంకి కరెక్ట్ సబ్జెట్జ్‌కి నువ్ దొరికావ్.. ఆ సినిమా పేరు ‘జీఎస్టీ 2’ ఈ సినిమాలో నటించడానికి మీరు రెడీ అయితే చెప్పండి... మీకు ఎంత డబ్బుకావలిస్తే అంత నేను ఇస్తా. మీరు పోర్న్ సినిమా చేస్తా అని అన్నారు కాబట్టే ఈ ఆఫర్ ఇస్తున్నా అంటూ అంటూ శ్రీరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు దర్శకుడు అజయ్ కౌండిన్య. అయితే ఈ దర్శకుడు ఇటీవల సీనియర్ నటి రోజాతో ‘జీఎస్టీ 2’ తీస్తా అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేసి తరువాత మీడియా పూర్వకంగా క్షమాపణలు తెలియజేసిన విషయం తెలిసిందే. 

loader