ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తనపని తాను చూసుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. తన గురించి మీడియాలో ఎలాంటి రాతలు రాసినా ఈ హీరో పెద్దగా రియాక్ట్ అవ్వడు. రీసెంట్ గా రవితేజని ఉద్దేశిస్తూ దర్శకుడు అజయ్ భూపతి 'చీప్ స్టార్' అని ఒక కామెంట్ వేశాడు. దీని గురించి 
మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.

కానీ రవితేజ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. 'మహాసముద్రం' సినిమాకి రవితేజ రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగారని.. నిర్మాత ఇవ్వకపోవడం వలన పక్కకి తప్పుకున్నాడని.. ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్ విషయంలో రవితేజ కాస్త పేచీ పెడుతుంటాడని వార్తలు వస్తుంటాయి. దీంతో జనాలు ఆ వార్తలు నమ్మేశారు.  అయితే ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడానికి రెమ్యునరేషన్ కాదని తెలిసింది.

అజయ్ భూపతి చెప్పిన కథ రవితేజకి నచ్చినప్పటికీ,సెకండ్ హాఫ్ రాసుకున్న విధానం రవితేజకి నచ్చలేదట. దీంతో కొన్ని మార్పులు చేయాలని కోరాడట. సాధారణంగా అనుభవం ఉన్న హీరోలు కథలో మార్పులు అడగడం సహజమే.. రవితేజ కూడా అలానే అడిగాడు. కానీ అజయ్ భూపతి తను రాసుకున్న కథనే నమ్ముకోవడంతో మార్పులు చేయడానికి ఒప్పుకోలేదట. అదే కథతో రవితేజని కన్విన్స్ చేయాలనుకున్నాడు.

దీంతో ఈగో సమస్యలు తలెత్తి రవితేజ సినిమా చేయనని చెప్పేశాడట. రవితేజ కథ వేలు పెట్టాలని చూడడం అజయ్ భూపతికి నచ్చక 'చీప్ స్టార్' అనే కామెంట్ చేశాడట. ఈ ట్వీట్ ని జనాలు రకరకాలుగా అర్ధం చేసుకుంటున్నా.. కానీ రవితేజ ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా వదిలేశాడు.