అజయ్ భూపతి ‘మంగళవారం’కు సెన్సార్ షాక్.. రెండు లైన్లు తీసేయమంటే.. సాంగే లేపేశాడు.!

అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘మంగళవారం’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. రీసెంట్ గా వచ్చిన సాంగ్ నుంచి రెండు లైన్ల లిరిక్స్ ను తొలగించాలనుకుంది. దీనిపై ఆయన ఇలా స్పందించారు. 
 

Director Ajay Bhupathi about Appadappada Thaandra Song NSK

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhuapthi) Mangalavaaramతో వస్తున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) , 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'మంగళవారం' సినిమా విడుదల కానుంది. ఇప్పటికే యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. 

ఈ క్రమంలో వారం కింద ‘అప్పుడప్పడ తాండ్ర’ (Appadappada Thaandra) అనే సాంగ్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ ను కూడా సొంతం చేసుకుంది. అయితే చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో షాక్ తగిలింది. ఈ పాటలోని రెండు లైన్ల లిరిక్స్ ను తొలగించాలని సెన్సార్  నిర్ణయించింది. దీంతో అజయ్ భూపాతి మాత్రం సెన్సార్ కట్ కు అంగీకరించలేదు. మొత్తం సాంగ్ నే సినిమాలో లేకుండా చేశారు. 

దీనిపై తాజాగా అజయ్ భూపతి స్పందించారు. సెన్సార్ ‘అప్పడప్పడ తాండ్ర’లోని రెండు లైన్లను సెన్సార్ చేశారు. ఆ లిరిక్స్ ఛేంజ్ చేయాలని చెప్పారు. అలా చేస్తే సాంగ్ లో ఉన్న ఫీల్ మొత్తం పోతుంది. దాంతో థియేట్రికల్ వెర్షన్ లో ఈ సాంగ్ ఉండదు. ఓటీటీ వెర్షన్ లో మాత్రం సాంగ్ ఉంటుందని చెప్పారు.  ఆలోగా ఫుల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామన్నారు. దీంతో పలువురు సెన్సార్ ఇచ్చిన షాక్ కు అజయ్ భూపతి రిప్లై మామూలుగా లేదుగా అంటున్నారు. 

ఇక ఈ రోజు (నవంబర్ 11) హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రాబోతుండటం విశేషంగా మారింది. అల్లు ఆర్మీ సమక్షంలో ఈ వేడుక జరగనుంది. గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్రంలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios