తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2లో గీతామాధురిని విన్నర్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ కౌశల్ తాకిడి ముందు ఆమె నిలవలేకపోయింది. కానీ బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 12లో మాత్రం టీవీ సీరియల్ నటి దీపిక విజేతగా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది.

ఎన్నో వివాదాలు, ఫన్ టాస్క్ ల తరువాత ఐదుగురు కంటెస్టంట్స్ ఫినాలేకి చేరుకున్నారు. వారిలో శ్రీశాంత్, దీపిక కాకర్, కరన్వీర్ బొహ్ర అలానే కామన్ పీపుల్ రోమిల్ చౌదరి,  దీపక్ ఠాకూర్ ఉన్నారు.

ఈ నలుగురిని వెనక్కి నెట్టి దీపిక విజేతగా నిలిచారు. శ్రీశాంత్ ఫస్ట్ రన్నరప్ గా నిలవగా, దీపక్ ఠాకూర్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. విజేతగా దీపికను అనౌన్స్ చేయగానే ఆమె ఎంతో ఎమోషన్ కి గురయ్యారు.

బిగ్ బాస్ వేదికకు సలాం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రోగ్రాం విజేతగా నిలిచి ఆమె రూ.30 లక్షల క్యాష్ ప్రైజ్ ని దక్కించుకుంది. ఈ షోలో ఆమెకి మద్దతుగా నిలవడానికి ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం వచ్చారు.