ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ పేరు చెబితే ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్ లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల్ని అర్థం చేసుకోవడం కష్టం అనే అభిప్రాయం ఉంది. అయినా కూడా ఆయన చిత్రాలని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. అదే ఈ క్రేజీ దర్శకుడు చేసే మ్యాజిక్. 

క్రిస్టఫర్ నోలెన్ ప్రతి చిత్రం ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది. నోలెన్ ప్రస్తుతం తెరక్కిస్తున్న చిత్రం 'టెనెట్'. ఈ చిత్రాన్ని నోలెన్ అద్భుతమైన యాక్షన్ ఫిలింగా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటిస్తున్నారు. 

డింపుల్, నోలెన్ కలసి సెట్స్ లో ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. డింపుల్ లుక్ ఈ చిత్రంలో షాకిచ్చే విధంగా ఉండబోతోంది. దాదాపు ఏడు దేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో టెనెట్ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.