కిరణ్‌ అబ్బవరం ఇటీవల `క` మూవీతో పెద్ద హిట్‌ని అందుకున్నారు. ఇండస్ట్రీలో మళ్లీ పుంజుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో రాబోతున్నారు. `దిల్‌ రూబా` రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

`క` సినిమాతో హిట్‌ అందుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కిరణ్‌ అబ్బవరం బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. వరుస ఫెయిల్యూర్‌ నుంచి బిగ్‌ రిలీఫ్‌ మాత్రమే కాదు, మరో పదేళ్ల కెరీర్‌కి రాచ బాట వేసింది.

ఈ క్రమంలో కంటెంట్ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో రావాలని నిర్ణయించుకున్నారు కిరణ్‌ అబ్బవరం. కొత్త సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన `దిల్‌ రూబా సినిమాతో రాబోతున్నారు.

రుక్స్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించారు. శివమ్‌ సెల్యులాయిడ్స్, మ్యూజిక్‌ లేబుల్‌ సరిగమ కి చెందిన ఏ యూడ్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి, సరిగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చింది. 

నిజానికి `దిల్‌ రూబా` మూవీ చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకే తాము వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ ఇచ్చారు. వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. మార్చి 14న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కరెక్ట్ గా నెల రోజుల గ్యాప్‌ తర్వాత ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. 

read more: ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?

తాజాగా కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ఇందులో వర్షం కురుస్తుండగా, వానలో తడుస్తూ బాధ ఆవేదన, కోపం కలగలిపిన ఫీలింగ్‌లో ఉన్నారు కిరణ్‌ అబ్బవరం. వెనకాల ఇళ్లు ఉంది, పోలీస్‌ కారుపై మంగళూరు అని ఉంది. మరి మంగళూరుకి ఈ కథకి సంబంధమేంటి? ఈ సినిమా స్టోరీ అక్కడే సాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

పోస్టర్‌ కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసేలా ఉంది. ఇదిలా ఉంటే మార్చిలో సినిమా రిలీజ్‌ అంటే రిస్క్‌ తో కూడుకున్నదే. ఆ సమయంలోనే ఇంటర్‌, టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఆడియెన్స్ సినిమాకి దూరమయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ మూవీతో కిరణ్‌ మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.

read more: ఫ్యామిలీపై మళ్లీ రెచ్చిపోయిన మంచు మనోజ్‌.. తొక్కుదామనుకుంటున్నది వాళ్లేనా?

also read: సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు!