- Home
- Entertainment
- ఎన్టీఆర్ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్, నిర్మాతలు అడ్వాన్స్ చెక్.. ఎవరా దర్శకుడు ?
ఎన్టీఆర్ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్, నిర్మాతలు అడ్వాన్స్ చెక్.. ఎవరా దర్శకుడు ?
Ntr Next movie: ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం మూవీ సినిమాలున్నాయి. తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించిన అదిరిపోయే వార్త లీక్ అయ్యింది. కోలీవుడ్ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నారట.

NTR
Ntr Next movie: జూ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన `వార్ 2` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అనంతరం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభమవుతుందని తెలుస్తుంది. భారీ యాక్షన్ మూవీగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు.
Ntr
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన లైనప్ మ్యాటర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో `వార్ 2`తోపాటు ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలోనే `దేవర 2` చేయాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా మరో సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది. తమిళ దర్శకుడితో సినిమా ప్లానింగ్ జరుగుతుందట.
nelson dileep kumar
`జైలర్` సినిమాతో కోలీవుడ్‌లో దుమ్ములేపిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ ఓకే అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. మైత్రీ నిర్మాతలు ఎన్టీఆర్-నెల్సన్ కాంబోని సెట్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
అయితే ఈ మూవీకి నెల్సన్ పారితోషికం వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఎన్టీఆర్ సినిమా కోసం ఏకంగా రూ కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారట. ఈ మేరకు నిర్మాతలు డైరెక్టర్‌కి అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చారట. కేవలం రూ50కోట్లు మాత్రమే కాదు, లాభాల్లో షేర్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే సౌత్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా నెల్సన్ నిలుస్తాడని తెస్లుంది. తారక్‌తో నెల్సన్ ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం నెల్సన్.. రజనీకాంత్ హీరోగా `జైలర్ 2` మూవీని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ లుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
read more: Brahma Anandam Movie Review: `బ్రహ్మా ఆనందం` మూవీ రివ్యూ, రేటింగ్