తెలుగు సినిమా స్టార్ హీరోలందరితో పనిచేసిన దిల్ రాజు త్వరలో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. చేస్తారు కూడా..అలాగే వారి వారసులతోనూ సినిమాలు చేస్తారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్‌రాజు ఇప్పుడు చిత్రమైన సిట్యువేషన్ లో ఇరుక్కున్నారు. అటు ధైర్యం చేసి ముందుకు వెళ్లలేరు. వెనక్కి వెళ్లలేని పరిస్దితి. దిల్ రాజు ఇన్నాళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్దితి ఎదురు కాలేదంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు ఎంతపేరుందో అంతకు మించి తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఆయన వెలుగుతున్నారు. ఆయనకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పట్టు,అనుభవం ఉంది. అదే ఆయనకు ఇప్పుడు తలనొప్పులను కూడా తెచ్చిపెడుతోంది.అందుకు కారణం తను ప్రొడ్యూస్ చేస్తున్న భారీ చిత్రం వారసుడు. వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి సీజన్ లో ఎప్పటిలాగే పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఇప్పటికే ఆదిపురుష్ ఈ పోటీ నుండి తప్పుకుంది. అయినా కూడా మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ టైమ్ లో ఖచ్చితంగా థియేటర్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు. రెండూ మైత్రీ బ్యానర్ నుంచి వచ్చినవే. ఈ రెంటిలో ఏదీ ప్రక్కన పెట్టే పరిస్దితి లేక రెండు సంక్రాంతికే తెస్తున్నారు నిర్మాతలు ఇక ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమా ‘వరిసు’ కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ హీరోగా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రస్తుతం తెలుగులో రాష్ట్రాల్లో థియేటర్లని లాక్ చేస్తున్నారు దిల్ రాజు. అయితే ఈ సీజన్‌లో చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు లైన్‌లో ఉండటంతో బి, సి సెంటర్లలో విజయ్ సినిమాని ఎగ్జిబిటర్లు సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేరు. దిల్ రాజు నైజాంలో మార్కెట్‌ను శాసిస్తారు. అక్కడ కావాల్సిన థియేటర్స్ వేసుకోగలరు. కానీ అయితే ఇది డిస్ట్రిబ్యూటర్ గా ఆనందం కలిగించినా, నిర్మాతకు సమమస్యగా మారుతుంది. తెలుగు సినిమా స్టార్ హీరోలందరితో పనిచేసిన దిల్ రాజు త్వరలో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. చేస్తారు కూడా..అలాగే వారి వారసులతోనూ సినిమాలు చేస్తారు. ఈ సిట్యువేషన్ లో తన సినిమా కోసం స్క్రీన్స్ బ్లాక్ చేస్తే ఆ హీరోలకు, వారి అభిమానులకు కోపాలు వస్తాయి.
అలాగని అదే టైమ్ లో తెలుగు రాష్ట్రాల్లో వారసుడు రిలీజ్ ను ఆయన విస్మరించలేరు. అది భారీగా నిర్మించిన దిల్ రాజు సొంత సినిమా. ఇక్కడ సరైన రిలీజ్ లేకపోతే రేపు తమిళ హీరోలతో సినిమా చెయ్యాలంటే వాళ్లు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. ఈ సిట్యువేషన్ లో దిల్ రాజు తెలివిగా వ్యవహిస్తున్నారు. వారసుడు థియేట్రికల్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో ధర చెప్తున్నారని వినికిడి. అయితే మిగతా డిస్ట్రిబ్యూటర్లు ఓ తమిళ హీరో సినిమాకు మాత్రం భారీ ధర చెల్లించే మూడ్ లో ఉన్నారా లేదా అన్నది ప్రశ్నార్దంకం. అయితే ‘వారసుడు’ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.తమిళ్ లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అది బాగా ప్లస్ అవుతుంది. పూర్తి స్దాయి రికవరీ అక్కడే అవుతుందంటున్నారు.
తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో రూ. 72 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మధ్య సొంతం చేసుకుందట. ఓవర్సీస్ రిలీజ్ రైట్స్‌ను రూ. 38 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని... తెలుగు, తమిళ భాషల హక్కులను సుమారు 150 కోట్లకు అటు ఇటుగా అమ్మేశారని టాక్. ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. ఐదు కోట్లకు ఆ డీల్ కుదిరిందని బాలీవుడ్ టాక్. తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట.
